చాణక్య నీతి: భార్యకు భర్త ఎప్పటికీ చెప్పకూడని 4 విషయాలు
కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అప్పట్లో చాణక్యుడు చెప్పిన మాటలు ఎప్పటికీ ఆచరణీయంగానే ఉంటాయి. ముఖ్యంగా మనుషుల వ్వవహారశైలికి సంబంధించి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి జీవితానికీ ఎంతో ఉపయోగపడతాయి.
వాస్తవాన్ని ప్రతిబింబిస్తూ చాణక్యుడు చెప్పిన ప్రతి పలుకూ..ఎలా ప్రవర్తించాలి -ఎలా ప్రవర్తించకూడదో అనే విషయాలపై స్పష్టతనిస్తాయి. ఈ కోవలోనే భార్య-భర్త ఎలా ఉండాలన్నదానిపైనా కొన్ని సూచనలు చేశాడు
భర్త ఎప్పటికీ ఆ నాలుగు విషయాలు భార్యకు చెప్పకూడదన్నాడు. ఆ నాలుగు విషయాలు ఏంటంటే...
1.ఆదాయం భర్త సంపాదన ఎంతో పూర్తిగా భార్యకి చెప్పకూడదంటాడు చాణక్యుడు. భర్త సంపాదన భార్యకు తెలిస్తే ఇంట్లో దూబరా ఖర్చు పెరిగిపోతుందట. ఒక్కోసారి ఈ ఖర్చు ఆదాయాన్ని మించిపోవచ్చు.
2. బలహీనత ప్రతి మనిషికీ ఓ బలహీనత ఉంటుంది. ఆ బలహీనత ఏంటో భార్యకు తెలియనివ్వకూడదు భర్త. సాధారణంగా ఏ చిన్న గొడవ జరిగినా, సందర్భం వచ్చినా రాకపోయనా భర్త బలహీనతను పదే పదే ప్రస్తావిస్తుంటారు భార్యలు.
అందుకే బలహీనత తెలియనివ్వకుండా జాగ్రత్తపడాలంటాడు చాణక్యుడు. ఒక్కసారి భర్తలో ఆత్మన్యూనతా భావం పెరిగితే ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది.
3. పొందిన అవమానం ఎక్కడైనా అవమానం ఎదుర్కొంటే..పొరపాటున కూడా ఈ విషయం భార్యకు తెలియకుండా జాగ్రత్తపడాలంటాడు చాణక్యుడు. లేదంటే భార్య ముందు చులకనగా మారిపోయే ప్రమాదం ఉంది.
ఇది దాంపత్య జీవితంలో పొరపొచ్చాలకు దారితీస్తుంది. ఇంకా చెప్పాలంటే బయట పొందిన అవమానం కన్నా పదిరెట్లు ఎక్కువ అవమానం అప్పుడు ఇంట్లోనే ఎదుర్కోవాల్సి వస్తుంది.
4. చేద్దామనుకున్న సహాయం ఎవరికైనా సహాయం చేయాలి అనుకుంటే అది నిశ్సబ్ధంగా చేయండి. ఓ భర్త తను ఎవరికైనా సహాయం చేయాలనుకున్న విషయం భార్యకు చెబితే ఊహించని సమస్యలు ఎదురవుతాయంటాడు చాణక్యుడు.
ఒక్కోసారి ఆ సహాయం చేయనీయకుండా అడ్డుపడే అవకాశం ఉంది. పైగా ఒక్కోసారి భర్త సహాయం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు భార్య ఎవరికైనా సహాయం చేయమని అడగొచ్చు. అందుకే సహాయం గుప్తంగానే ఉండాలంటాడు చాణక్యుడు