ABP Desam


సెప్టెంబరు నెల ఈ రాశులవారికి అస్సలు బాలేదు!


ABP Desam


మేషం
మేష రాశి వారు సెప్టెంబర్ నెలలో ప్రతి పనిని ఓపికగా చేయవలసి ఉంటుంది. కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మనోధైర్యం తగ్గుతుంది. చంచల మనసత్త్వం ,సోమరితనం మిమ్మల్ని ఇబ్బందిపెడుతుంది.


ABP Desam


వృషభం
ఈ నెల ఈ రాశివారికి కుటుంబంలో తరచూ కలహాలుంటాయి. భార్య-భర్త మధ్య అన్యోన్యత లోపిస్తుంది. రావాల్సిన బాకీలు వసూలు కావు..ఇవ్వాల్సినవి మాత్రం తప్పదు.ఏ పని తలపెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి.


ABP Desam


మిథునం
ఈ నెల మిథునరాశివారికి పిత్రార్జిత ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది. బంధువులను, స్నేహితులను కలుస్తారు. సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది.


ABP Desam


కర్కాటకం
కర్కాటక రాశివారిని ఈనెల చర్మ వ్యాధులు ఇబ్బంది పెడతాయి. అనుకున్న పనులు పూర్తికావు..ఖర్చులు పెరుగుతాయి. మీ కింద పనిచేసేవారివలన మాటలు పడతారు. నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేస్తారు.


ABP Desam


సింహం
మీ మాటలను అదుపులో ఉంచుకోండి. బంధుమిత్రులతో కలహాలు సూచనలున్నాయి. శారీరకంగా ఏదో తెలియని బాధ వెంటాడుతుంది.అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సింహ రాశి విద్యార్థులు విద్యలో సక్సెస్ అవుతారు.


ABP Desam


కన్యా
ఈ నెలలో ఈ రాశి ఉద్యోగులకు స్థానచలనం ఉండొచ్చు. బంధువర్గంతో అనుకోకుండా విరోధాలు జరుగుతాయి మాట తూలొద్దు. నమ్మినవారివలన మోసపోతారు. పనుల్లో ఆటంకాలు, ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. కోపం పెరుగుతుంది.


ABP Desam


తుల
ఈ నెల తులారాశివారికి అనుకూల ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యం బావుంటుంది. పాతబాకీలు వసూలవుతాయి. ధనలాభం, కుటుంబంలో సంతోషం ఉంటుంది. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.


ABP Desam


వృశ్చికం
ఈ నెల వృశ్చికరాశివారికి మంచి జరుగుతుంది. అవివాహితులకు ఈనెలలో వివాహ ప్రతిపాదన రావొచ్చు. రాజకీయ వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి.


ABP Desam


ధనుస్సు
ఈ నెలలో మీరు మీ కుటుంబ జీవితంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. అకారణ కలహాలు, తండ్రికి అనారోగ్యం సూచనలున్నాయి. ఏ పని చేసినా లాభనష్టాలు సమానంగా ఉంటాయి. వ్యాపారులు లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. వైవాహిక జీవితం బావుంటుంది.


ABP Desam


మకరం
మకర రాశి వారికి ఈ మాసంలో కుటుంబ జీవితంలో కలహాలుంటాయి. వివాహితులు తమ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. అపనిందలు, అనారోగ్యం, స్త్రీలతో విరోధాలు, అజీర్ణవ్యాధి.


ABP Desam


కుంభం
ఈ నెల ఈ రాశివారి జీవిత భాగస్వామికి అనారోగ్య సూచనలున్నాయి. మాట పట్టింపులుంటాయి. గతంలో కన్నా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్నేహితులతో సమయం గడిపే అవకాశం లభిస్తుంది.ప్రభుత్వాధికారుల వల్ల లాభపడతారు. మీ గౌరవం పెరుగుతుంది.


ABP Desam


మీనం
మీన రాశి వారికి సెప్టెంబర్ నెల అద్భుతంగా ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తు, వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది. పై అధికారులతో స్నేహలాభం. పెద్దల సలహాలు లేకుండా ఏ నిర్ణయం తీసుకోపోవడం మంచిది.