లంబోదరుడు, బొజ్జ గణపయ్య, వినాయకుడు, పార్వతీ తనయుడు ఇలా రకరకాల పేర్లతో పిలిచే ఆ రూపం వెనుక ఎంతో తాత్వికత ఉంది.
పూర్ణకుంభంలాంటి ఆ దేహం పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు . లంబోదరుడి పెద్దబొజ్జ భోజనప్రియత్వానికి చిహ్నం కాదు...జీవితంలో ఎదురయ్యే మంచిచెడులను జీర్ణించుకోవాలని తెలియజేస్తుంది.
ఏనుగు తల మేధస్సుకు సంకేతమైతే. సన్నని కళ్ళు నిశిత పరిశీలనకు గుర్తు వక్రతుండం ఓంకార ప్రణవనాదానికి ప్రతీక
ఏనుగు లాంటి ఆయన ఆకారాన్ని మోస్తున్న మూషికం ఆశకు చిహ్నం. మూషికం చిన్నగానే వున్నా ఎంత దూరమైనా ప్రయాణిస్తుంది. వేగంగా కదులుతుంది. అంటే పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చని చాటిచెబుతుంది.
వినాయకుడి పొట్టచుట్టూ ఉండే సర్పం శక్తికి సంకేతం. విఘ్నేశుడి నాలుగు చేతులు మానవాతీత సామర్ధ్యాలకు, తత్వానికి సంకేతం
చేతిలో ఉన్న పాశం, అంకుశం సన్మార్గంలో నడిపించు సాధనాలకు ప్రతీకలు
చేటంత చెవులు... అనవసరమైన వ్యర్థమైన విషయాలను చేటలా చెరిగేసి అవసరమైన మంచి సంగతులను మాత్రమే స్వీకరించాలని సూచిస్తాయి
చిన్న నోరు అతిగా మాట్లాడినందువల్ల అనర్థాలే తప్ప ఒరిగేదేం ఉండదు..ఎక్కువ తెలుసుకుని తక్కువ మాట్లాడాలని చెబుతోంది
వినాయకుడు ధరించిన గొడ్డలి ఇహలోక బంధాలు శాశ్వతం కాదని, వాటిని తెంచేసుకోవాలని సూచిస్తోంది
గణేషుడికి ఇష్టమైన లడ్డూ ఆశయాలకు అనుగుణంగా అడుగేస్తే విజయం మీ సొంతం అవుతుందని అర్థం (Images Credit: Pinterest)