శివుడికి 12 జ్యోతిర్లింగాలు, పార్వతి దేవికి 52 శక్తి పీఠాలు, విష్ణుకు 108 దివ్య దేశాలు ఎలా ఉన్నాయో వినాయకుడికి కూడా అష్టవినాయక ఆలయాలున్నాయి.
అష్టవినాయకులు అనగానే ఒక్కోటి ఒక్కో రాష్ట్రంలో ఉందేమో అనుకోవద్దు. ఈ అష్ట వినాయకు ఆలయాలన్నీ పుణెలకు దగ్గర్లోనే ఉన్నాయి. కేవలం వంద కిలోమీటర్ల పరిధిలో ఈ ఎనిమిది ఆలయాలున్నాయి.
1. అష్టవినాయక మందిరం ఇది పుణెకు 80 కిలోమీటర్ల దూరంలోని మోరేగావ్ లో ఉంది.
2. సిద్ధివినాయక మందిరం ఇది పుణెలకు 111 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధాటెక్ గ్రామంలో ఉంది.
3. బల్లాలేశ్వర ఆలయం పుణె నుంచి పాలి గ్రామానికి 119 కిలోమీటర్ల. పాలి గ్రామంలో ఈ ఆలయం కొలువుదీరి ఉంది.
4. వరద వినాయక మందిరం పుణె నుంచి 130 కిలోమీటర్ల దూరం మహాడ్ ప్రాంతంలో ఉంది ఈ గుడి.
5. చింతామని మందిరం పుణె నుంచి కేవలం 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న తియూర్ గ్రామంలో కొలువుదీరింది.
6. గిరిజాత్మజ మందిరం పుణె నుంచి 97 కిలోమీటర్ల పరిధి ఉన్న లేయాంద్రి గ్రామంలో ఉంది.
7. విఘ్నహర మందిరం, పుణె నుంచి 223 కిలోమీటర్ల దూరంలో ఒజార్ ప్రాంతంలో ఉంది ఈ ఆలయం.
8. మహాగణపతి మందిరం పుణె నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంజనగావ్ లో కొలువుదీరింది ఈ ఆలయం.