మేషం ఈ రోజు ఆఫీసులో సాధారణంగానే ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మనస్సులో ఏదో అశాంతి నిండిఉంటుంది.
వృషభం మీ మొండి వైఖరిని వీడకపోతే చాలా నష్టపోతారు. అతిగా తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. పెట్టుబడికి అనుకూలమైన రోజు. స్నేహితులు లేదా బంధువులతో వివాదం జరగొచ్చు..జాగ్రత్త. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
మిథునం ఈ రోజు మిథున రాశివారు ఏం అనుకున్నా నెరవేరుతుంది.తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. మారుతున్న వాతావరణం ప్రభావం మీ ఆరోగ్యంపై ఉండొచ్చు. జీవితంలో కొన్ని మార్పులు సంతోషాన్ని ఇస్తాయి.
కర్కాటకం మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఖర్చులు పెరగుతాయి. మీ ప్రేమికుల మధ్య అపార్థాలకు అవకాశం ఉంది. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. నిత్యం సూర్యుడిని ప్రార్థించండి.
సింహం ఈ రోజు సింహ రాశి వారు తమ పనిలో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారులు అప్రమత్తంగా లేకుంటే నష్టపోవచ్చు. కార్యాలయంలో సీనియర్ అధికారులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమికులకు మంచి రోజు.
కన్య కెరీర్‌లో శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. ఇంటా బయటా ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు తలనొప్పితో బాధపడతారు. అనవసర ఖర్చులు తగ్గించుకోండి.
తుల ఈ రోజు తుల రాశి వారికి గౌరవం పెరుగుతుంది. మీ ప్రియమైన వారితో సామరస్యంగా నడుచుకోండి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణంలో కొందరు ముఖ్య వ్యక్తులు కలుస్తారు..
వృశ్చికం ఈ రోజంతా సరదాగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కార్యాలయంలోని వ్యక్తులు మీ పనితీరుని మెచ్చుకుంటారు. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. అప్పులు తిరిగి చెల్లించడం మంచిది.
ధనుస్సు ఈ రోజు కార్యాలయంలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సాయంత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.
మకరం ఈరోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఖర్చులు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. వాతావరణం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ప్రతిదీ ఓపికతో చేయండి
కుంభం ఈ రోజు కుంభ రాశి వారు తమ బిజీ రొటీన్ నుంచి కొంత సమయాన్ని కుటుంబం కోసం వెచ్చిస్తారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి.ఉద్యోగులు, వ్యాపారులు,విద్యార్థులకు మంచి రోజు.
మీనం ఈరోజు మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి రావొచ్చు. పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ మొండి స్వభావం కారణంగా కొన్ని తప్పులు చేస్తారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి