ఆగస్టు 31 వినాయకచవితి రోజు రాశిఫలాలు



మేష రాశి
భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరగడం వల్ల మనసు కలత చెందుతుంది. మీ తండ్రితో కొనసాగుతున్న విభేదాలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చు.



వృషభ రాశి
ఈ రోజు మీరు ఇతరులకు సహాయం చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఉద్యోగులకు పనిపై శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.



మిథున రాశి
ఈ రోజు మిథున రాశి వారు శ్రమకు తగ్గట్టుగా లాభాలు పొందుతారు. వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నవారికి ఇదే మంచి సమయం. పనిలో చాలా బిజీగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో స్పెండ్ చేస్తారు.



కర్కాటక రాశి
ఈ రోజు కర్కాటక రాశి వారికి మిశ్రమ రోజు. కుటుంబంలో ఓ శుభకార్యం నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వ్యాపారులకు కుటుంబ సహకారం లభిస్తుంది.



సింహ రాశి
ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నడబ్బు ఈ రోజు చేతికందుతుంది. ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు.



కన్యా రాశి
మీ మనసులో ఏదైనా పనిపై సందేహాలుంటే ఆ పని చేయకపోవడమే మంచిది. విద్యార్థులు చదువులో మరింత కష్టపడాలి. ఉద్యోగులు కార్యాలయంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు సీనియర్ అధికారులతో మాట్లాడండి.



తులా రాశి
పిల్లల పట్ల మీ బాధ్యతను నెరవేర్చడంలో మీరు సక్సెస్ అవుతారు. రాజకీయ రంగంలో పనిచేసే వ్యక్తులకు మేలు జరుగుతుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో గౌరవం పొందుతారు.



వృశ్చిక రాశి
ఈ రోజు వృశ్చిక రాశివారికి మంచి రోజు. మీ లక్ష్యంపై దృష్టి సారించాలి. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం, గౌరవం అందుకుంటారు. మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకున్న తర్వాత మాత్రమే ఖర్చు చేయండి.



ధనుస్సు రాశి
ఈ రోజు ధనుస్సు రాశి వారికి తండ్రి తరపువారి ఆస్తులు కలిసొస్తాయి. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు.



మకర రాశి
ఈ రోజు మకర రాశి వారికి అనుకూలమైన రోజు. ఉద్యోగులు సహోద్యోగుల సహాయంతో కార్యాలయంలో మీ ఇమేజ్‌ని మెరుగుపరచుకోగలరు. ఇంటికి సన్నిహిత మిత్రుడు లేదా స్నేహితుడి రాక వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.



కుంభ రాశి
ఈ రోజు మీరు సమస్యల నుంచి విముక్తి పొందుతారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి. విద్యార్థులు కొన్ని శుభవార్తలు వింటారు.ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు.



మీన రాశి
ఈ రోజు మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కార్యాలయంలోని అధికారులు మీతో సంతోషంగా ఉంటారు. అనుభవజ్ఞులైన వారితో మాట్లాడి భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకోవచ్చు.