Garuda Puran: భర్త భార్యను- భార్య భర్తను హింసిస్తే గరుడ పురాణం ప్రకారం శిక్షేంటో తెలుసా!
Garuda Puran: గరుడపురాణం ప్రకారం నరకంలో విధించే శిక్షలేంటి..ఏ పాపానికి ఎలాంటి శిక్ష విధిస్తారంటే...
Garuda Puran: మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు. మనిషి బతికి ఉన్నప్పుడు చేసిన పాపాలకు ఏయే శిక్షలు పడతాయని గరుత్మంతుడు విష్ణువును అడుగుతాడు. విష్ణుమూర్తి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాడు. విష్ణువు గరుడుని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేరొచ్చింది. ఇందులో ప్రధానంగా రెండు భాగాలున్నాయి. ఒకటి... పూర్వఖండం. రెండోది ఉత్తర ఖండం.
పూర్వఖండంలో బ్రహ్మాదుల ఆవిర్భావం, రాజుల కథలు, వ్యాకరణం, ఛందస్సు, యుగధర్మాలు, విష్ణువు దశావతారాల గురించి ఉంటాయి. ఉత్తర ఖండంలోని ప్రథమాధ్యాయంలో ప్రేతకల్పం అనే భాగం ఉంది. అందులో మరణానంతరం జీవుడు ఏం చేస్తాడో వివరంగా ఉంటుంది. గరుడపురాణం ప్రకారం నరకంలో విధించే శిక్షలేంటి..వాటిలో కొన్ని శిక్షలివే
తమిశ్రం
ఎవరైతే ఇతరుల సంపదను దోచుకుంటారో, దొంగిలిస్తారో వారికి చేతులు కాళ్లు కట్టేసి కొరడాతో దారుణంగా కొడతారు.యమదూతలు కాలపాశంతో కట్టేసే చిమ్మచీకటి నరక కూపాన్నే తమిశ్రం అంటారు.
అంద తంత్రసం
భార్య భర్తను కానీ..భర్త భార్య ను కానీ హింసిస్తే మానసికంగా, శారీరికంగా బాధ పెడితే అంద తంత్రసం శిక్ష విధిస్తారు. చిమ్మ చీకటిలో విధించే ఈ శిక్ష వర్ణనాతీతంగా ఉంటుంది.
లాలభక్షణం
అతి కాముకులు, భార్యను కట్టుబానిసంగా కన్నా నీచంగా చూసే వాళ్లకి ఈ శిక్ష తప్పదు. ఇలాంటి వారికి వారి వీర్యాన్నే వాళ్లతో తాగిస్తారు. వీర్యపు సముద్రంలో పడేసి...అందులోనే మునుగుతూ తేలుతూ అదే తాగుతూ శిక్షాకాలం పూర్తిచేయాలి.
Also Read: గరుడ పురాణం ఇంట్లో ఉండొచ్చా-ఉండకూడదా!
రౌరవం
ఇతరుల ఆస్తులను , భూములను అన్యాయంగా దోచుకుని వారి కన్నీటిపై కోటలు కట్టేవారికి విధించే శిక్ష రౌరవం. విషసర్పంతో కరిపించి హింసిస్తారు..
మహా రౌరవం
పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తులను వారసులకు చెందకుండా అడ్డుపడి తమ వశం చేరుకున్న వారికి మహా రౌరవమే దిక్కు. ఇలాంటి వారిని క్రూర మృగాల మధ్య,విష సర్పాల మధ్య వదిలేస్తారు.
కుంభీపాకం
తమ ఆనందం కోసం ఎదుటివారిని బాధించేవారికి విధించే శిక్ష కుంభీపాకం. సలసల మరుగుతున్న నూనెలో ఆ పాపిని వేసి క్రూరంగా భాదిస్తారు.
అసితపత్రవనం
తమ పనిని గాలికి వదిలేసి ఇతరుల వ్యవహారాల్లో వెలుపెట్టేవాళ్లకి అసితపత్రవనం శిక్ష తప్పదు. అధికార దుర్వినియోగానికి పాల్పడి, అక్రమాలు, అన్యాయాలు చేసేవారు, సరిగా వ్యవహరించని పాలకులకు ఈ శిక్ష తప్పదు.
Also Read: పక్కవాళ్లకు స్వీట్ ఇవ్వకుండా తింటే కూడా పాపమే? గరుడ పురాణంలో ఘోరమైన శిక్ష?
అంధకూపం
చిన్న చీమకు కూడా అపకారం తలపెట్టని వారిని బాధించేవారు,అపకారికైనా ఉపకారం చేసేవారిని బాధించేవారికి అంధకూపం శిక్ష తప్పదు.
తప్తమూర్తి
బంగారం, విలువైన వజ్రాలు, నగలు,డబ్బు కాజేసేవారికి విధించే శిక్ష తప్తమూర్తి. నిప్పుల కొలిమి చుట్టూ నాలుగు నాలుకలు మండుతూ ఉంటాయి..ఇలాంటి వారిని వాటిపై పడేస్తారు.
క్రిమిభోజనం
ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళను ఆదరించకుండా, వాళ్ళకు మెతుకు విదిల్చకుండా తినేవాళ్లు, మింగేవాళ్ళను, ఎదుటి వాళ్ళను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని అవసరం తీరాక విసిరిపారేసే వాళ్ళను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడేస్తారు.
వజ్రకంటకశాలి
జాతి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపే వారు వజ్రకంటకశాలి శిక్ష విధిస్తారు. పదునుదేరిన వజ్రాలతో తయారుచేసిన బొమ్మను కౌగిలించుకోమని చెబుతారు..ఆ వజ్రాలు శరీరంలోకి దిగబడి ఒంటిని జల్లెడ చేస్తాయి.అక్కడ కత్తుల్లాంటి ముళ్ళున్న చెట్టు ఉంటుంది. ఆ చెట్టెక్కమని అక్కణ్ణుంచి కిందికి బరబరా ఈడ్చేస్తారు. దాంతో ఒళ్ళంతా ఎక్కడికక్కడ తెగిపోతుంది.
పూయోదకం
వైతరిణిలో ఉండే కాలుష్య జలమంతా కలిసేది పుయోదకం అనే బావిలోనే. పెళ్లిచేసుకునే ఉద్దేశం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లల్ని నమ్మించి మోసం చేసేవారికి ఈ శిక్ష విధిస్తారు
వైశాసనం
పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు.
సారమేయాదానం
ఆహారంలో విషం కలిపే వాడు, ఊచకోతకు దిగేవాడు, దేశాన్ని సర్వనాశనం చేసే వాడు ఈ నరకానికి వస్తాడు.ఈ నరకంలో తినడానికి కుక్కమాంసం తప్ప మరేదీ దొరకదు. దాన్ని తిన్న వెంటనే కుక్కలు గుంపులు గుంపులుగా వచ్చి పడి పాపి మాంసాన్ని పీక్కుతింటాయి
.