చాణక్య నీతి: ప్రతి కుటుంబ పెద్ద పాటించాల్సిన మూడు సూత్రాలు



ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో కుటుంబం, విద్య, వైవాహిక జీవితం, ఉద్యోగం మరియు డబ్బుకు సంబంధించిన విషయాలను ప్రస్తావించడంతో పాటూ ఎన్నో సమస్యలకు పరిష్కారాలను కూడా సూచించాడు.



ఆచార్య చాణక్యుడి విధానాలను తన జీవితంలో అలవరచుకున్న వ్యక్తి...ఎంతటి కష్టాన్నైనా జయించగలడు..తన సక్సెస్ అని అడ్డుకోవడం ఎవ్వరి తరం కాదు..



కుటుంబ పెద్ద మూడు ముఖ్యమైన సూత్రాలు అనుసరించడం ద్వారా ఆ ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుందన్నాడు చాణక్యుడు



ఇంటి పెద్ద కుటుంబంపై పెద్ద బాధ్యతను కలిగి ఉంటాడు. దానిని నిర్వహించడం పెద్ద సవాలే మరి. అలాంటి పరిస్థితిలో వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ఉండాలి..



1.కుటుంబానికి సమయం కేటాయించండి
చాణక్య నీతి ప్రకారం కుటుంబాన్ని ఏకతాటిపైకి తీసుకెళ్లడం ఇంటి పెద్దల బాధ్యత. అలా జరగాలంటే కుటుంబం కోసం సమయం కేటాయించాలి.



కుటుంబానికి సమయం కేటాయించడం వల్ల వారి మనసులో ఏమైనా స్పర్థలు ఉంటే తొలగి అందరి మధ్యా ప్రేమపూర్వక వాతావరణం మాత్రమే ఉంటుందని చెప్పాడు



2. అనవసరంగా ఖర్చు చేయవద్దు
పిల్లలు ఏదైనా ఇంటి పెద్దని చూసే ఫాలో అవుతారు. ఇలాంటి పరిస్థితిలో కుటుంబ పెద్ద కూడా తన ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. అలవాట్లను మెరుగుపరచుకోవాలి.



డబ్బుని అనవసరంగా ఖర్చు చేయవద్దు అని చెప్పేముందు..ఇంటి పెద్ద దుబారాని తగ్గించుకోవాలి. భవిష్యత్ లో ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలో చేతల్లో చేసి చూపించాలి.



3.తోబుట్టువులతో సత్సంబంధాలు
ఇంట్లో సంతోషం, శాంతి, సానుకూలత నెలకొనాలంటే ఇంటి అధిపతి తన సోదర సోదరీమణులతో సత్సంబంధాలు కొనసాగించాలని చెబుతాడు చాణక్యుడు



సోదర, సోదరీమణులతో మంచి సంబంధాలు లేకుంటే అది మీ కుటుంబంపై చెడు ప్రభావం పడుతుంది. భవిష్యత్ లో మీ పిల్లల మధ్య కూడా సఖ్యత కరువవుతుంది..