'బ్రహ్మాస్త్రం' లోహంతో తయారైన ఆయుధం కాదు మంత్రంతో వచ్చే పవర్



బ్రహ్మాస్త్రం అంటే పురాణేతిహాసాల్లో ఎన్నోసార్లు ప్రస్తావించిన ఒక అస్త్రం. రామాయణ, మహాభారత యుద్ధాల్లో ప్రయోగించిన అస్త్రం..ఇంతకీ బ్రహ్మాస్త్రం అంటే ఏంటి ? ఎవరెవరు ఎప్పుడు ప్రయోగించారు?



బ్రహ్మాస్త్రం అంటే చాలామంది అపోహ ఏంటంటే బ్రహ్మ ఇచ్చిన అస్త్రం, బ్రహ్మ దేవుడు సృష్టించిన అస్త్రం అనుకుంటారు. కానీ బ్రహ్మము అనేది ఓ తత్వం...వివరణ చెప్పలేనిది అని అర్థం.



సృష్టి అంతా ఒక్కటే అయితే ఎవరో..ఆయనే పరమాత్మ, పరబ్రహ్మ అని పేరు..ఆయన ద్వారా వచ్చిన అస్త్రం కాబట్టి బ్రహ్మాస్త్రం అని పేరు.



అస్త్ర-శస్త్రాలు రెండింటినీ కలపి చెబుతారు కానీ ఈ రెండింటి మధ్యా చాలా వ్యత్యాసం ఉంది. శస్త్రం అంటే పదునుగా చెక్కిన ఆయుధం. ఈటె, కత్తి ఇవన్నీ శస్త్రాలుగా చెప్పొచ్చు.



అస్త్రం అంటే అక్కడ ఏం వస్తువు ఉందన్నది కాదు మంత్ర బలంతో పనిచేసేదని అర్థం. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ క్షణం అక్కడ ఓ గడ్డిపరక దొరికితే దాన్ని అభిమంత్రించి వదిలిపెడితే అది అస్త్రంగా మారుతుంది.



బ్రహ్మాస్త్రం, వరుణాస్త్రం, అగ్ని అస్త్రం..ఇలా వీటికి లోహంతో పనిలేదు..మంత్ర బలంతో పనిచేస్తాయి. బ్రహ్మాస్త్రం పూర్తిగా గురు శుష్రూష చేస్తే మాత్రమే ఆ బలం లభిస్తుంది కానీ బలవంతంగా దక్కించుకునేది కాదు..



ఈ బ్రహ్మాస్త్రం త్రేతాయుగంలో రాముడికి ఉంది. యుద్ధంలో చివరిగా ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే రావణ సంహారం చేశాడు.



ద్వాపర యుగంలో భీష్ముడు,పరుశరాముడకి, కృష్ణుడికి, ద్రోణుడికి,అర్జునుడికి,కర్ణుడికి కూడా బ్రహ్మాస్త్రం ఉంది.



పరుశరాముడి నుంచి ద్రోణుడు, కర్ణుడు.. ద్రోణుడి నుంచి అర్జునుడు ఇది నేర్చుకున్నారు. కృష్ణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించలేదు..



బ్రహ్మాస్త్రం అంటే.. అంతకుమించి ఆయుధం లేదని అర్థం. అందుకే భారత సైన్యంలోనూ శక్తివంతమైన మిస్సైల్స్‌కు బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. మోడ్రన్ మిస్సైల్ టెక్నాలజీకి బ్రహ్మాస్త్ర టెక్నిక్స్‌ మూలం అన్న చర్చ కూడా ఉంది.



మహాభారత కాలం నాటి అస్త్రాలు ఇప్పటి అణ్వాయుధాల కంటే భయంకరమైనవని అంటూ గోర్బోవ్ అనే రష్యన్ పండితుడు చెప్పాడంటారు.