ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఒక వ్యక్తి స్వభావం, యోగ్యత , దోషాలు, విద్య, వ్యాపార జీవితం, సంపద, వివాహం ఇలా అన్ని అంశాల గురించి ప్రస్తావించాడు.
జీవితంలో సక్సెస్ అవ్వాలనుకున్న వ్యక్తి తన పనిపై అంకిత భావంతో ఉండాలని, కృషి-విధేయత-నిజాయితీ కలగి ఉండాలని తన నీతిశాస్త్రంలో చెప్పాడు
అదే సమయంలో, ఒక వ్యక్తికి నిజాయితీగా ఉండటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు.
నిటారుగా ఉన్న చెట్టే అందుకు ఉదాహరణ
నిటారుగా ఉన్న చెట్టును నరికివేయడానికి ఎక్కువ శ్రమ అవసరం లేదని..ఎవ్వరైనా సులభంగా పడదోయగలరన్నాడు చాణక్యుడు
అలాగే మితిమీరిన నిజాయితీతో ఉండే వ్యక్తి కూడా ఎందుకూ పనికిరానివాళ్ల కారణంగా కూడా బాధపడాల్సి ఉంటుందని, ఇతరులు తొందరగా వీరిని వినియోగించుకుంటారని బోధించాడు చాణక్యుడు
నిజాయితీ ఉండాలి కానీ ఆ నిజాయితీతో పాటూ పరిస్థితులను ఎదుర్కొనే తెలివితేటలు కూడా ఉండాలని చెప్పాడు చాణక్యుడు
క్లిష్టమైన వ్యక్తులను ఎదుర్కొనే తెలివితేటలు లేకపోతే మీ ప్రణాళికలు, మీ ఆలోచనలను దొంగిలించేవారు, మిమ్మల్ని వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతుందని బోధించాడు