చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ఎన్నో విషయాలు పొందుపరిచాడు. వాటిలో భాగంగా మనుషుల ప్రవర్తనపైనా చాలా విషయాలు ప్రస్తావించాడు.
ముఖ్యంగా చాణక్యుడికి స్త్రీలంటే చాలా చిన్నచూపు ఉందంటారంతా. తన నీతిశాస్త్రంలో ప్రస్తావించిన కొన్ని విషయాలే అందుకు కారణం
చాణక్యుడు స్త్రీల స్వభావం గురించి చెప్పిన విషయాలు గమనిస్తే షాక్ అవుతారు..అవేంటంటే...
అబద్ధాలు చెప్పడం, స్వార్థం, అసూయ, కఠినంగా ప్రవర్తించడం, మూర్ఖత్వం , పరిశుభ్రతపాటించకపోవడం, క్రూరత్వం లాంటివి స్త్రీలలో ప్రధానంగా ఉండే అంశాలు అంటాడు చాణక్యుడు. అందుకే స్త్రీలు ఎంతకష్టపడినా మగవారిని మించి ఎదగలేరన్నాడు
పురుషుల కన్నా స్త్రీలకు ఆకలి రెండు రెట్లు, సిగ్గు నాలుగు రెట్లు, ధైర్యం ఆరు రెట్లు, కోరికలు ఎనిమిదిరెట్లు ఉంటాయట
స్త్రీల స్వభావాన్ని చెబుతూనే..ఎలాంటి స్త్రీని వివాహం చేసుకోవాలో కూడా చెప్పాడు చాణక్యుడు.
యువతి అంద విహీనంగా ఉన్నా మంచి కుటుంబానికి చెందినదైతే వివాహం చేసుకోవచ్చు కానీ ఎంత అందంగా ఉన్నా కుటుంబం మంచిది కానప్పుడు అలాంటి యువతిని పెళ్లిచేసుకోరాదు
మర్యాద ఎలా ఇచ్చి పుచ్చుకోవాలో రాజుల నుంచి... సంభాషణ ఎలా జరపాలో పండితుల నుంచి... అబద్ధం ఎలా చెప్పాలో జూదగాళ్ల నుంచి నేర్చుకున్నట్టే...స్త్రీల నుంచి కపటం, వంచన నేర్చుకోవాలట
ఇత్తడి పాత్రలను బూడిద, రాగి పాత్రలను ఆమ్ల పదార్థాలు ఎలా శుభ్రంచేస్తాయో..స్త్రీలను రుతుక్రమం అలా శుభ్రం చేస్తుందని చెప్పాడు చాణక్యుడు.