ABP Desam


గరుడ పురాణం ఇంట్లో ఉంటే ఏమవుతుంది!


ABP Desam


పురాణాలు ఫాలో అయ్యేవారికి, దేవుడంటే భక్తి విశ్వాసాలు ఉండేవారికి తరచూ వచ్చే సందేహం..గరుడ పురాణం ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా అనే. ఇంతకీ ఈ ప్రచారం నిజమెంత.


ABP Desam


అష్టాదశ పురాణాల్లో ఒకటైన గరుడపురాణాన్ని సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు తన సారథి అయిన గరుత్మంతునికి ఉపదేశించగా, వేదవ్యాసుడు రచించారు.


ABP Desam


ఆయన గ్రంథస్థం చేసినది చదవడానికే కదా..అయినప్పటికీ చాలామందిలో సందేహం ఉండిపోయింది. కానీ ఈ గ్రంథం తప్పకుండా ఇంట్లో ఉండాల్సినది, చదవాల్సినది అంటున్నారు పండితులు.


ABP Desam


ఈ పురాణంలో మూడు భాగాలున్నాయి
ఆచారకాండ ( కర్మకాండ)
ప్రేతకాండ ( ధర్మకాండ)
బ్రహ్మకాండ( మోక్షకాండ)


ABP Desam


మొదటికాండను పూర్వఖండమనీ చివరి రెండు కాండలనూ కలపి ఉత్తర ఖండమనీ వ్యవహరిస్తారు. ఈ కాండలు దేనికవే విభిన్నంగా ఉంటాయి.


ABP Desam


ఆచార కాండ-240 అధ్యాయాలు
ప్రేతకాండ -50 అధ్యాయాలు
బ్రహ్మకాండ- 30 అధ్యాయాలు


ABP Desam


ఇహలోకంలో ధర్మంగా ఉండి పరలోకంలో పరమాగతి పొందమని చెబుతోంది గరుడ పురాణం. లేదంటే చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదని బోధిస్తోంది.


ABP Desam


వాస్తవానికి గరుడపురాణం రేపో మాపో పోయేవారి కోసం కాదు.. అందరూ చదవాల్సిన గ్రంథం. ఇది చదివితే తప్పకుండా పాపభీతి కలుగుతుంది. గరుడపురాణం చదివితే పితృదేవతలు కూడా అదృశ్యరూపంలో వచ్చి వింటారట.


ABP Desam


ఈ పురాణంలో యముడు ప్రధాన దేవత. మన పాపపుణ్యాల వివరాలన్నిటినీ చిత్రగుప్తుని ద్వారా తెలిసుకుని తగిన శిక్షలు విధిస్తాడు. కేవలం భౌతికంగా చేసిన పాపాలు మాత్రమే కాదు, మానసికంగా చేసిన పాపాలు కూడా ఇందులో కౌంట్ అవుతాయి


ABP Desam


శిక్షలన్నీ అనుభవించిన తర్వాత స్వచ్ఛమైన ప్రకాశంతో ఆత్మ పరమాత్మలో లీనం కావడమో మరుజన్మ లభించడమో జరుగుతుంది.


ABP Desam


ఫైనల్ గా చప్పేదేంటంటే...అన్ని పురాణ గ్రంధాలు ఇంట్లో పెట్టుకున్నట్టే గరుడపురాణం కూడా నిరభ్యంతరంగా ఇంట్లో ఉంచుకోవచ్చు, నిత్యం చదువుకోవచ్చు. (Images Credit: Pinterest)