ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఒక వ్యక్తి స్వభావం, యోగ్యత , దోషాలు, విద్య, వ్యాపార జీవితం, సంపద, వివాహం ఇలా అన్ని అంశాల గురించి ప్రస్తావించాడు.
చేయాల్సిన మంచి పనులు, అలవర్చుకోవాల్సిన మంచి లక్షణాలు గురించి మాత్రమే కాదు..కొన్ని చేయకూడని పనుల గురించి కూడా బోధించాడు. వాటిలో ఒకటి...కొందరిని నిద్రలేపొద్దని...ఎవరెవరిని అంటే....
చిన్నపిల్లల్ని పిల్లలకు ఆకలి వేస్తోందనో, ఎక్కువ సేపు నిద్రపోతున్నారనో ఉద్దేశంతో పిల్లల్ని బలవతంగా నిద్రలేపేస్తుంటారు. ఇలా చేస్తే వాళ్లని మళ్లీ నిద్రపుచ్చడం చాలా కష్టం. పైగా చిన్నారుల ఎదుగుదలకు నిద్రే తోడ్పడుతుందని చాణక్యుడు చెప్పాడు.
పాలకుడు లేదా ఉన్నతాధికారులు అప్పట్లో రాజు..ఇప్పుడు పాలకులు లేదా ఉన్నతాధికారులు. వీళ్లకి కూడా నిద్రాభంగం కలిగిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట. వారి కోపానికి బలవకుండా అస్సలు తప్పించుకోలేరంటాడు చాణక్యుడు.
మూర్ఖులు .వీళ్లని నిద్రలేపడం అంటే కోరి కష్టాలు కొనితెచ్చుకున్నట్టేనట. ఎందుకంటే ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలనే ఉద్దేశంతో మూర్ఖులను ఎంత నిద్రలేపినా కానీ ఆ పని అవకపోగా మీకు కొత్త తలనొప్పులు మొదలవుతాయన్నాడు చాణక్యుడు.
సింహం పొరపాటున కూడా సింహం నిద్రకు భంగం కలింగంచకూడదట. అలా చేస్తే ఎంత ప్రొటెక్షన్ ఏర్పాటుచేసుకున్నప్పటికీ మిమ్మల్ని మీరు కాపాడుకోవడం చాలా కష్టం.
క్రూర జంతువులు సింహం మాత్రమే కాదు క్రూర జంతువులకు నిద్రాభంగం చేయకూడదంటాడు చాణక్యుడు. ఆకతాయి తనంతో అలాంటి పనులు చేస్తే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఈ జాబితాలో కుక్క కూడా ఉంది.
పాము పాముని ఎవరైనా నిద్రలేపుతారా అని అమాయకంగా అడగొద్దు..ఎందుకంటే..చాలా మంది నిద్రపోతున్న పాముని.. చచ్చిపోయిందేమో అనుకుని కర్రతో, రాళ్లతో కొడుతుంటారు.
పాము నిజంగా చచ్చిపడిఉంటే పర్వాలేదు కానీ నిద్రపోయి ఉండగా లేపితే మాత్రం మీకు మూడినట్టే.