ABP Desam


దసరా 2022: శరన్నవరాత్రుల్లో ఒక్కసారైనా చదవాల్సిన పద్యం


ABP Desam


దుర్గమ్మను స్తుతిస్తూ బమ్మెర పోతన చెప్పిన 'అమ్మలగన్నయమ్మ' పద్యం అందరకీ తెలిసే ఉంటుంది. ఈ పద్యం వెనుక ఎంత అర్థం, మహత్తు ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు...


ABP Desam


అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె
ద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులో


ABP Desam


నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్


ABP Desam


అమ్మలగన్నయమ్మ - లలితాసహస్రం 'శ్రీమాతా' అనే నామంతో ప్రారంభమవుతుంది. శ్రీమాతా అంటే 'శ' కార, 'ర' కార, 'ఈ' కారములతో సత్వ, రజస్తమోగుణాధీశులైన శక్తి. బ్రహ్మశక్తి, రుద్రశక్తి, విష్ణుశక్తి. అంటే, 'లలితాపరాభట్టారికా' స్వరూపం.


ABP Desam


ముగ్గురమ్మల మూలపుటమ్మ- మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతులుగా కొలిచే తల్లులు.


ABP Desam


'చాలా పెద్దమ్మ' -మహాశక్తి. అండపిండబ్రహ్మాండం అంతటా నిండిపోయిన బ్రహ్మాండమైన శక్తి స్వరూపం. శక్తి స్వరూపం చిన్నా, పెద్దా బేధం లేకుండా సమస్త జీవులలో నిండిపోయినదని అర్థం. అలా ఉండడం అనేది మాతృత్వం.


ABP Desam


'సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ'- దేవతలకు శత్రువైన వాళ్ల అమ్మకు కడుపుశోకం మిగిల్చిన అమ్మ లేదా రాక్షసులు నశించడానికి కారణమైన అమ్మ.


ABP Desam


'తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబున నుండెడి అమ్మ'- మనకి అష్టమాత్రుకలు బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి , చాముండా, కౌమారి, వారాహి, మహాలక్ష్మి. ఈ అష్టమాత్రుకలు శ్రీచక్రముం దేవతలుగా ఉంటారు.


ABP Desam


ఈ అష్టమాత్రుకలకు శక్తిని ఇచ్చిన అమ్మవారు ఎవరో ఆవిడే వేల్పుటమ్మల మనంబున ఉండెడి యమ్మ. 'దుర్గ మాయమ్మ'- ఈ దుర్గమ్మ ఉన్నదే ఆవిడే లలితాపరాభట్టారికా. అ అమ్మ, మా యమ్మ


ABP Desam


'మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్- ఆవిడ నాకు దయతో మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదలను ఇవ్వాలి.


ABP Desam


ఎక్కడున్నా అమ్మలగన్నమ్మ శ్లోకం చదివితే ఓం, ఐం, హ్రీం, శ్రీం, శ్రీమాత్రేనమః అనేస్తున్నామన్నమాట. అంటే ఆ తల్లి ఉపాసన చేస్తున్నట్టే.
(Images Credit: Pinterest)