చెడు శకునాలు: బయటకు వెళ్లేటప్పుడు ఇవి ఎదురొస్తే అస్సలు మంచిది కాదంటారు..



బయలుదేరే సమయంలో ఏడుపు వినిపించడం అస్సలు శుభసూచకం కాదు



అకాల వర్షం, తుమ్ములు , బల్లి మీదపడడం, గొడవ పెట్టుకుని వెళ్లడం ఇవన్నీ చెడు శకునాలే



వితంతువు, జుట్టువిరబోసుకున్న స్త్రీ, గుండుతో ఉన్న స్త్రీ ఎదురొస్తే తలపెట్టిన పని జరగదట



పిల్లి, పాము, కొత్తకుండ, నూనె, కట్టెలమోపు, కుంటికుక్క, ఉప్పు, బొగ్గులు, రాళ్ళు, నువ్వులు, మినుములు, గొర్రెలు, పంది, దూది, మజ్జిగ, బూడిద చెడు శకునాలు



ముగ్గురు వైశ్యులు, జంటశూద్రులు, కషాయబట్టలు కట్టినవారు, ఒక్క బ్రాహ్మణుడు, అంగ వైకల్యం ఉన్నవారు, గర్భిణీ, బిచ్చగాడు ఎదురొస్తే అన్నీ అశుభాలే అంటారు



ఆయుధం చేతపట్టుకున్నవాడు, విరోధి, దెబ్బతగలడం, తొట్రుపాటు, మనసు కీడు శంకించడం, అనారోగ్యంగా ఉండడం, గుడ్లగూబ అరవడం ఇవన్నీ అశుభాలే



ఎవరైనా బయలుదేరే సమయంలో వెళ్లొద్దని కోరడం, భోజనం చేసి వెళ్లమని అడగడం అస్సలు చేయరాదట.



ఇంట్లోంచి ఎవరైన ప్రయాణమై వెళ్లిన వెంటనే ఇల్లు కడగడం , ఇల్లాలు తలస్నానం చేయడం అస్సలు మంచిదికాదంటారు