టాలీవుడ్ స్టార్స్‌లో ఆల్మోస్ట్ అందరూ సిక్స్ ప్యాక్ చేస్తున్నారు. పర్‌ఫెక్ట్ ఫిజిక్‌తో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నారు. త్వరలో విడుదల కాబోయే 'ఆర్ఆర్ఆర్', 'లక్ష్య', 'గని', 'లైగర్' సినిమాల్లో హీరోలు సిక్స్ ప్యాక్‌లో కనిపించనున్నారు. అంతకు ముందు కూడా యంగ్ స్టార్స్ సిక్స్ ప్యాక్ చేశారు.
'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్. ఆయన 'అరవింద సమేత... వీరరాఘవ' సినిమాలోనూ ప్యాక్డ్ బాడీతో కనిపించారు.
'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్. ఇంతకు ముందు 'ధృవ' సినిమాలో కూడా సిక్స్ ప్యాక్‌తో కనిపించారు.
'లైగర్' కోసం విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ చేశారని టాక్. ఇంకా స్టిల్ విడుదల చేయలేదు.
'లక్ష్య'లో హీరో నాగశౌర్య ఇలా ఎయిట్ ప్యాక్‌లో కనిపించనున్నారు.
బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన 'గని' కోసం వరుణ్ తేజ్ ప్యాక్డ్ బాడీ చేశారని టాక్.
త్వరలో సిక్స్ ప్యాక్‌తో రాబోతున్న హీరోలు వీళ్లు. మరి, ఇంతకు ముందు సిక్స్ ప్యాక్ చేసిన హీరోలు ఎవరు? ఓ లుక్కేయండి.
'బాహుబలి'లో ప్రభాస్. 'సాహో'లోనూ ఆయన సిక్స్ ప్యాక్ బాడీ చూపించారు.
'దేశముదురు'లో అల్లు అర్జున్ స్టిల్ ఇది. 'వరుడు', 'బదీనాథ్' సినిమాల కోసమూ ఆయన సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్ చేశారు.
'బాహుబలి'లో రానా కూడా ప్యాక్డ్ బాడీతో కనిపించారు.
ఇప్పుడు నితిన్ ప్యాక్డ్ బాడీలో లేరు కానీ... గతంలో ఆయన ఎయిట్ ప్యాక్ చేశారు.
ఎప్పుడూ ప్యాక్డ్ బాడీ మైంటైన్ చేసే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. 'శ్రీదేవి సోడా సెంటర్', 'వి', హిందీ సినిమా 'బాఘీ', అంతకు ముందు తెలుగు సినిమాల్లో ఆయన ప్యాక్డ్ బాడీతో కనిపించరు.
కార్తికేయ కూడా ఎప్పుడూ ప్యాక్డ్ బాడీతో ఉంటారు. 'రాజా విక్రమార్క'తో పాటు అంతకు ముందు సినిమాల్లో ఆయన సిక్స్ ప్యాక్‌తో కనిపించారు.
సునీల్ కూడా సిక్స్ ప్యాక్‌తో లేరు. కానీ, ఒకప్పుడు సిక్స్ ప్యాక్ చేసి... అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు.
నవదీప్‌ది కూడా సిక్స్ ప్యాక్ బాడీనే.
సిక్స్ ప్యాక్ క్లబ్‌లో ఉన్న మరో యంగ్ హీరో అఖిల్ అక్కినేని. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్‌లో ఆయన సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నారు.