పాలబుగ్గల సుందరి హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టింది. బుల్లితెరపై పలు యాడ్స్ లో కూడా కనిపించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా హృతిక్ రోషన్ తో కలిసి నటించిన 'కోయి మిల్ గయా' సినిమా హన్సికకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. 2007లో 'దేశముదురు' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోవడంతో వరుస అవకాశాలు వచ్చాయి. ఎంత వేగంగా స్టార్ డం అందుకుందో.. అంతే వేగంగా టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయింది. కానీ తమిళంలో ఆమెకి మంచి అవకాశాలు వచ్చాయి. బొద్దుగా ఉండే హీరోయిన్స్ ను ఇష్టపడే తమిళ ప్రేక్షకులు హన్సికను నెత్తిన పెట్టుకున్నారు. చిన్న ఖుష్బూ అంటూ ఆమెకి పేరు పెట్టేసుకొని.. ఏకంగా గుడి కూడా కట్టేశారు. తెలుగు ప్రేక్షకులు ఆమెని మర్చిపోయినప్పటికీ తమిళంలో మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. హన్సిక లేటెస్ట్ ఫొటోలు..