News
News
X

Virgo horoscope 2023 :ఆ ఒక్క విషయంలో తప్ప 2023 బాగా కలిసొస్తుంది, కన్యారాశి వార్షిక ఫలితాలు

Virgo horoscope 2023 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Virgo horoscope 2023 : 2023 ప్రారంభంలో కన్యారాశివారికి శని 5 వ స్థానంలో ఉంటుంది ఆ తర్వాత ఆరో ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ సందర్భంగా మీకు అనుకూల ఫలితాలే ఉన్నాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగం, వ్యాపారం స్థిరంగా ఉంటుంది. దేవ గురు బృహస్పతి ఏడాది ప్రారంభంలో ఏడవ ఇంట సంచరించడం వల్ల మీ వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది.  జీవిత భాగస్వామితో మీ సాన్నిహిత్యం  మరింత పెరుగుతుంది. ఏప్రిల్లో బృహస్పతి ఎనిమిదో స్థానంలో సంచరించడంతో పాటూ.. రాహువుతో కలవడం వల్ల ఈ వ్యవధి మీకు అంత అనుకూలంగా ఉండదు. అనారోగ్య సమస్యలు, మానసిక ఇబ్బందులు ఉంటాయి. అయితే ఈసమయంలో ఎక్కువ ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపడం వల్ల కొంత ఉపశమనం ఉంటుంది. అక్టోబరు తర్వాత రాహువు ఏడో స్థానంలో సంచరించినప్పుడు, కేతువు కూడా మీ రాశిలోకి ప్రవేశిస్తాడు.. ఆ సమయంలో నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. కుటుంబ వాతావరణం,ఉద్యోగం, వృత్తిగత జీవితం అన్నింటా జాగ్రత్తలు అవసరం

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

కన్యరాశి ఫలాలు 2023 

 • గడిచిన ఏడాదితో పోలిస్తే 2023 కన్యారాశివారు ఊరట చెందుతారు. వ్యక్తిగతం జీవితం, ఉద్యోగం, వ్యాపారం అన్నింటా మెరుగైన ఫలితాలుంటాయి. అనారోగ్య సూచనలున్నాయి..ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తప్పదు.
 • ఆర్థిక పరిస్థితి బావుంటుంది. న్యాయపరమైన విషయాల్లో మీదే పైచేయి అవుతుంది. శత్రువులు, ప్రత్యర్థులపై అన్నింటా పైచేయి సాధిస్తారు. శని దేవుడి అనుగ్రహం మీకు ఉండడంతో...సక్సెస్ విషయంలో అనుకున్నదానికన్నా రెండు అడుగుల ముందే ఉంటారు. అయితే మీకున్న బద్ధకాన్ని వీడాలి...సోమరితనం కారణంగా ముఖ్యమైన అవకాశాలు కొన్ని కోల్పోతారు..
 • మీ బంధం బలంగా ఉండాలంటే మీలో కొన్ని మార్పులు చేసుకోక తప్పదు. జనవరి, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబరు లో మీ ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. 
  జనవరి నుంచి ఏప్రిల్ లోపు ప్రయత్నిస్తే ప్రేమికులు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
 • 2023 ఆరంభంలో మీ కెరీర్ బావుంటుంది కానీ ఏప్రిల్ నెలలో కొంత గందరగోళానికి గరవుతారు. పని చేసే ప్రదేశంలో ఆకస్మిక మార్పులుంటాయి. మళ్లీ అక్టోబరు నుంచి అంతా మంచే జరుగుతుంది.
 • ఈ రాశి విద్యార్థులకు 2023 అనుకూల ఫలితాలనిస్తుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఏడాది ప్రారంభంలో చదువుపై శ్రద్ధ తక్కువ ఉన్నా రాను రాను శ్రద్ధ పెరుగుతుంది ఉన్నత విద్యకు సిద్దమవుతున్న విద్యార్థులకు ఈ ఏడాది ఒడిదుడుకులు ఎదురవుతాయి.
 • 2023లో కన్యారాశివారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.  జనవరి నుంచి ఏప్రిల్  వరకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ఆర్థిక సర్దుబాట్లు చేసుకోవచ్చు. ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ సమయం దానికి అనుకూలంగా ఉంటుంది. మళ్లీ అక్టోబరు సమయం సవాలుగా ఉంటుంది.  ఆ తర్వాత బావుంటుంది.
 • కన్యారాశి వారు నూతన సంవత్సరంలో కుటుంబ జీవితంలో ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. కుటుంబంలో ఉన్న వృద్ధులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఇంట్లోవారితో విభేదాలు తలెత్తవచ్చు. అయితే సవాళ్లను ఎదుర్కొని కుటుంబాన్ని ఐక్యంగా ఉంచే  సామర్థ్యాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. దీని కోసం మీరు చాలా ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతో తరచుగా మాట్లాడడం ద్వారా మిమల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది క్రమంగా కుటుంబ జీవితం మెరుగుపడుతుంది.
 • ఈ రాశి అవివాహితులకు ఏడాది ఆరంభంలో అనుకూలంగా ఉంది. ఒకవేళ పెళ్లి జరిగితే ఏప్రిల్ లోపు జరిగిపోతుంది. ఈ రాశివారి వైవాహిక జీవితం బావుంటుంది. జీవిత భాగస్వామికి ఆరోగ్య సంబంధిత సమస్యలు మీలో టెన్షన్ పెంచుతాయి. ఏడాది చివర్లో మీ వైవాహిక జీవితం బావుంటుంది.
 • కన్యారాశి వ్యాపారులు 2023లో తెలివిగా వ్యవహరించడం మంచిది. ఏడాది ప్రారంభంలో మంచి ఫలితాలే ఉన్నా రానురాను ఇబ్బందులు తప్పవు..అందుకే కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగేయాలి.
 • జనవరి నుంచి ఏప్రిల్ మధ్య ఆస్తుల కొనుగోలుకు అనుకూల సమయం. సెప్టెంబర్- అక్టోబర్ మధ్య ప్రయత్నాలు చేయవొచ్చు కాని నవంబర్ - డిసెంబర్ లో ఆస్తిని తీసుకోవడం మంచిది

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023  కర్కాటక  రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

కన్యా రాశి నెలవారీ ఫలితాలు 2023 

 • జనవరి నెల మీకు అనుకూలంగా ఉంటుంది. కొంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలుంటాయి. అనుకున్న ప్రతిపనిలో విజయం సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వ్యసనాలకు లోనైన వారు వాటికి దూరంగా ఉండడం మంచిది
 • ఫిబ్రవరి నెల కూడా మీకు అనుకూలంగానే ఉంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వివాహితులు సంతోషంగా ఉంటారు.  ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. వ్యాపారంలో లాభాలుంటాయి.
 • మార్చి ప్రారంభంలో అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. నెలాఖరుకి వచ్చేసరికి కొంత ఉపశమనం ఉంటుంది. వైవాహిక జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది.వ్యాపారం పెరుగుతుంది.
 • ఏప్రిల్,మే, జూన్ లో మీకన్నీ మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు మిమల్ని ఇబ్బంది పెడతాయి.వ్యాపారం క్షీణించవొచ్చు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇంట్లో వివాదాలు తప్పవు. రవాణా, షేర్ మార్కెట్ కి సంబంధించిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నష్టపోకతప్పదు.కొత్తగా ఏ ప్రారంభించాలి అనుకున్నా అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహాలు తీసుకోవడం మంచిది
 • జులై, ఆగస్టు, సెప్టెంబర్ లో మీకు అనుకూల ఫలితాలున్నాయి.  ఈ సమయంలో మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. మీరు మీ ప్రణాళికలలో విజయం సాధిస్తారు. ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఖర్చులు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి మంచి సమయం.
 • అక్టోబర్ నెల మీకు అద్భుతంగా ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న పనులు ప్రారంభమవుతాయి. ఇది మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. మీ ఆత్మవిశ్వాసం పెరగడంతో కొత్త ప్రణాళికలపై దృష్టి సారిస్తారు. వ్యాపారం పెరుగుతుంది. ఉద్యోగులకు బావుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే మానసిక ఒత్తిడి పెరుగకుండా చూసుకోవాలి.
 • నవంబర్ లో ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారం, ఉద్యోగాలు చేసేవారికి శుభసమయం.  వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది.తల్లిదండ్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి.తోబుట్టువుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది
 • డిసెంబరులో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సంతోషం కోసం ఏమైనా చేస్తారు. ఇది మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది.గృహంలో సౌకర్యాలు పెరుగుతాయి.కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మిమల్ని మీరు మంచి వ్యక్తిగా చిత్రించుకోగలుగుతారు.ఇంట్లో మీ గౌరవం పెరుగుతుంది.ఉద్యోగంలో మీ స్థానం మెరుగ్గా ఉంటుంది.

ఓవరాల్ గా ఈ ఏడాది కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ వాటి నుంచి తొందర్లోనే బయటపడి ముందడుగు వేస్తారు. ఆరోగ్యం విషయంలో మాత్రం నిర్లక్ష్యం వద్దు. ఆర్థిక పథకాల్లో పెట్టుబడి పెట్టేముందు జాగ్రత్తగా ముందుకు సాగాలి.

2023  సింహ  రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

Published at : 15 Dec 2022 09:08 AM (IST) Tags: leo horoscope 2023 yearly horoscope 2023 Yearly Rasi Phalalu 2023 Virgo Rasi Phalalu 2023 2023 Kanya Rasi Phalalu

సంబంధిత కథనాలు

Ratha Sapthami 2023 Slokas: రథసప్తమి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన శ్లోకాలు

Ratha Sapthami 2023 Slokas: రథసప్తమి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన శ్లోకాలు

Ratha Saptami 2023 Wishes In Telugu: జనవరి 28 శనివారం రథసప్తమి సందర్భంగా శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Ratha Saptami 2023 Wishes In Telugu: జనవరి 28 శనివారం రథసప్తమి సందర్భంగా శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Love Horoscope Today 28th January 2023: ఈ రాశులవారి వైవాహిక జీవితంలో టెన్షన్ తప్పదు

Love Horoscope Today 28th January 2023: ఈ రాశులవారి వైవాహిక జీవితంలో టెన్షన్ తప్పదు

Horoscope Today 28th January 2023: ఏదైనా భిన్నంగా చేసే అలవాటు ఈ రాశివారిని ప్రత్యేకంగా నిలుపుతుంది, జనవరి 28 రాశిఫలాలు

Horoscope Today 28th January 2023: ఏదైనా భిన్నంగా చేసే అలవాటు ఈ రాశివారిని ప్రత్యేకంగా నిలుపుతుంది, జనవరి 28 రాశిఫలాలు

Spirituality: ఈ రెండు తిథుల్లో ఏ పని ప్రారంభించినా అడ్డంకులు, అష్టకష్టాలు తప్పవా!

Spirituality: ఈ రెండు తిథుల్లో ఏ పని ప్రారంభించినా అడ్డంకులు, అష్టకష్టాలు తప్పవా!

టాప్ స్టోరీస్

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

CBI Case Avinash Reddy : సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !

CBI Case Avinash Reddy : సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !

Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు

Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?

Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?