News
News
X

2023 Cancer Yearly Horoscope: శని ఇబ్బంది పెడితే బృహస్పతి ఉపశమనం ఇస్తాడు, 2023 లో కర్కాటక రాశిఫలాలు

2023 Cancer Yearly Horoscope: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

2023 Cancer Yearly Horoscope:  2023లో కర్కాటక రాశివారికి అష్టమ శని కొన్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. అయితే దేవగురు బృహస్పతి మంచి స్థానంలో ఉండడం వల్ల ఆ నష్టాలు భర్తీ అవుతుంటాయి. మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమిస్తారు, ఇబ్బందులను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. కాస్త కష్టమైనా మీ రంగాల్లో మీరు విజయం సాధించగలరు. ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. తెలివైన నిర్ణయాలుతీసుకోగలుగుతారు. మీ సొంత వ్యూహాలను ఉపయోగించడం ద్వారా సవాలుతో కూడుకున్న పనులు కూడా సక్సస్ ఫుల్ గా పూర్తిచేయగలుగుతారు. 

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023 కర్కాటక రాశి ఫలాలు
ఎనిమిదో ఇంట శని సంచారం వల్ల ఏడాది ప్రారంభంలో ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు..అదే తీవ్రంగా మారే ప్రమాదం ఉంది . బృహస్పతి శుభ సంచారం వల్ల ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెరుగుతుంది. తీర్థయాత్రలు సందర్శిస్తారు. శని ఆటంకాలు కలిగిస్తుంటే బృహస్పతి ఆ ఆటంకాలు తొలగించి మీకు దారి చూపిస్తాడు
2023లో మొదటి నాలుగు నెలలు ఆర్థిక ప్రణాళికలు ప్రణాళిక ప్రకారం సాగుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడికి ప్లాన్ చేసుకోవచ్చు. ఏం చేసినా అదృష్టం కలిసొస్తుంది. ఏపని చేయాలని నిర్ణయించుకున్నారో అది పక్కాగా పూర్తిచేయగలుగుతారు. తల్లిదండ్రులు, గురువు,స్నేహితుల నుంచి మంచి సహకారం ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు, ఉద్యోగులకు శుభ ఫలితాలున్నాయి, పని చేసే వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. గతంలో కుటుంబం నుంచి ఉన్న కొన్ని ఒత్తిడిల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది... కుటుంబంలో ఇతర గొడవలు మీ వ్యక్తిగతజీవితంపై పడకుండా చూసుకోవాలి. కుటుంబంలో ఉండే సమస్యలు, చిక్కుముడులు పరిష్కరించుకునే సామర్థ్యం మీకు ఉంటుంది.. బృహస్పతి శుభసంచారం వల్ల మీరు తెలివైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 
2023లో ద్వితీయ నాలుగు నెలలు మొదటి నాలుగు నెలలతో పోలిస్తే ద్వితీయ నాలుగు నెలలు కొన్ని హెచ్చుతగ్గులుంటాయి. ఈ సమయంలో ఉద్యోగాలు మారే అవకాశం ఉంది. అధిక పనిభారం మీతో ఈ నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. ఈ సమయంలో కుటుంబంలో కలహాలు ఉండొచ్చు. పాత సమస్యలు మళ్లీ వెంటాడే అవకాశం ఉంది. 
2023లో చివరి నాలుగు నెలలు ఏడాదిలో చివరి నాలుగు నెలలు ప్రశాంతంగా ఉంటారు. సుదూర ప్రయాణాలు మనసుని అహ్లాదపరుస్తాయి.  మీ పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. సుదూరయాత్రల నుంచి లాభపడతారు..మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఏడాది ఆఖర్లో కుటుంబ జీవితం కూడా సంతోషంగా  ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఏడాది కర్కాటక రాశివారు ఆస్తి కొనుగోలు చేయగలుగుతారు

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023 కర్కాటక రాశివారి నెలవారీ ఫలితాలు

  • జనవరిలో ఆరోగ్యం విషయంలో మినహా మిగిలిన అన్నీ బావుంటాయి. ఒత్తిడి తగ్గుతుంది, ఉద్యోగం, వ్యాపారంలో సక్సెస్ అవుతారు. కుజుడు పదకొండో స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
  • ఫిబ్రవరి నెలలో ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. అవివాహితులకు పెళ్లి జరుగుతుంది. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. పిల్లల వల్ల కొన్ని సమస్యలుంటాయి.
  • మార్చి, ఏప్రిల్ లో గురుబలంతో అదృష్టం ఉంటుంది. కార్యాలయంలో పరస్పర మార్పిడికి అవకాశం  ఉంటుంది. ఉద్యోగం మారాలి అనుకున్న వారికి కూడా ఇదే సరైన సమయం. ఈ సమయంలో మానసిక ఒత్తిడికి లోనైనా మళ్లీ దాన్నుంచి బయటపడతారు
  • అంగారకుడి సంచారం వల్ల మే నెలలో కొంత చికాకుగా ఉంటుంది. ఈ సమయాల్లో చర్చలకు దూరంగా ఉండటం మంచిది
  • విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి జూన్ లో అడుగు ముందుకు పడుతుంది. ఈ నెలలో ఖర్చులు పెరుగుతాయి, వైవాహిక జీవితంలో సమస్యలుంటాయి.
  • జూలై 2023 ఆర్థిక విజయాన్ని తెస్తుంది. ఈ సమయంలో మీరు అహంకార ఆలోచనలు వదులుకుంటే మంచిది. మీ ప్రవర్తన కూడా వ్యక్తిగత, ఉద్యోగ జీవితంలో వివాదాలకు దారితీస్తుంది
  • ఆగస్ట్ మరియు సెప్టెంబరులో మీరు మరింత దృఢంగా మరియు సాహసోపేతంగా ఉంటారు. అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొంటారు.
  • అక్టోబర్‌లో మీరు ఆస్తులు కొనుగోలు చేయడంలో సక్సెస్ అవుతారు. మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి
  • నవంబర్‌లో మీ వ్యక్తిగత జీవితం బావుంటుంది. రాహువు మీ తొమ్మిదవ ఇంట్లోకి వెళ్లడంతో మీ రంగంలో కష్టాలు కూడా తొలగిపోతాయి. మంచి ఆర్థిక ప్రతిఫలాలను పొందుతారు
  • డిసెంబర్ కూడా మీకు మంచినెల అవుతుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి.

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

Published at : 08 Dec 2022 02:14 PM (IST) Tags: 2023 horoscope predictions cancer Rasi Phalalu 2023 cancer yearly horoscope 2023 Yearly Rasi Phalalu 2023 2023 New Year Horoscope

సంబంధిత కథనాలు

Mysterious Temples in India: శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఆలయాలివి, అడుగడుగునా మిస్టరీలే!

Mysterious Temples in India: శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఆలయాలివి, అడుగడుగునా మిస్టరీలే!

Maha Shivaratri 2023: మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది, సర్వం ఈశ్వరమయం అంటారెందుకు!

Maha Shivaratri 2023: మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది, సర్వం ఈశ్వరమయం అంటారెందుకు!

Love Horoscope Today 02 February 2023: ఈ రాశివారు జీవిత భాగస్వామితో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు

Love Horoscope Today 02 February 2023: ఈ రాశివారు జీవిత భాగస్వామితో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు

Horoscope Today 02nd February 2023: ఈ రాశివారికి తమ పనిపై కన్నా పక్కవారి పనిపై శ్రద్ధ ఎక్కువ, ఫిబ్రవరి 2 రాశిఫలాలు

Horoscope Today 02nd February 2023: ఈ రాశివారికి తమ పనిపై కన్నా పక్కవారి పనిపై శ్రద్ధ ఎక్కువ, ఫిబ్రవరి 2 రాశిఫలాలు

Vishnu Sahasranamam : విష్ణు సహస్రమానాల్లో ఏ శ్లోకం ఎలాంటి ఫలితాన్నిస్తుందంటే!

Vishnu Sahasranamam : విష్ణు సహస్రమానాల్లో ఏ శ్లోకం ఎలాంటి ఫలితాన్నిస్తుందంటే!

టాప్ స్టోరీస్

Telangana budget 2023 : రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ సరే - నిధుల సమీకరణ ఎలా ? తెలంగాణ సర్కార్‌కు ఇదే పెద్ద టాస్క్

Telangana budget 2023 : రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ సరే - నిధుల సమీకరణ ఎలా ? తెలంగాణ సర్కార్‌కు ఇదే పెద్ద టాస్క్

Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని

Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని

PROJECT-K 2 Parts | ప్రాజెక్ట్-K పై నమ్మకంతో Prabhas రిస్క్ చేస్తున్నారా..?| ABP Desam

PROJECT-K 2 Parts | ప్రాజెక్ట్-K పై నమ్మకంతో Prabhas రిస్క్ చేస్తున్నారా..?| ABP Desam

Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?

Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?