అన్వేషించండి

Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం

Manchu: మోహన్ బాబు ఇంకా ఆజ్ఞాతంలోనే ఉన్నారు. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. పోలీసుల మౌనం వ్యూహాత్మకమని భావిస్తున్నారు.

Mohan Babu:  జర్నలిస్టుపై హత్యాయత్నం కేసులో మోహన్ బాబు ఆజ్ఞాతంలో ఉన్నారు. ముందస్తు  బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పోలీసులు ఇరవై నాలుగో తేదీ తర్వాత మోహన్ బాబుకు నోటీసులు జారీ చేస్తామని ప్రకటించారు.కానీ ఆ రోజు ముగిసి ఐదు రోజులు అయినా పట్టించుకోలేదు. బయట కనిపిస్తే అరెస్టు చేస్తారేమోనన్న ఉద్దేశంతో మోహన్ బాబు  హైదరాబాద్‌లోనే ఉండటం లేదని చెబుతున్నారు. న్యాయపరమైన రిలీఫ్  వచ్చిన తర్వాతనే ఆయన మళ్లీ హైదరాబాద్‌లో కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. హైకోర్టులో మందస్తు బెయిల్ రాకపోవడంతో ఇక సుప్రీంకోర్టుకు వెళ్లాలి. అయితే ఇంకా పిటిషన్ దాఖలు చేయలేదు. 

మంచు కుటుంబంలో ఏర్పడిన వివాదం కారణంగా మంచు మనోజ్ ఓ రోజు ఇంటి గేటును తోసేసుకుని లోపలికి వెళ్లారు. తనతో పాటు మీడియా ప్రతినిధుల్ని తీసుకెళ్లారు. లోపల జరిగిన ఘర్షణ తర్వాత  ఓ టీవీ చానల్ రిపోర్టర్ మోహన్ బాబును స్పందన అడిగేందుకు ప్రయత్నించారు. కోపం తెచ్చుకుని ఆయన మైక్ తీసుకుని ఆయనపైనే దాడి చేశారు. ఆ రిపోర్టర్ కు తీవ్ర గాయాలు కావడంతో  హత్యాయత్నం కేసును పోలీసులు నమోదు చేశారు. నోటీసులు జారీ చేస్తే మోహన్ బాబు కోర్టుకు వెళ్లారు. ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకూ పోలీసుల ఎదుట హాజరు కాకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఆ గడువు ముగిసింది. పోలీసుల ఎదుట హాజరు కాకుండా ఉత్తర్వులు పొడిగించాలని ఆయన హైకోర్టులో పిటిషన్ వేయలేదు. 

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు

మోహన్ బాబు ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారని చెబుతున్నారు. అక్కడ మంచు విష్ణు కుటుంబం నివసిస్తోంది. ప్రస్తుతానికిఅక్కడే ఉంటున్నారని అంటున్నారు. పోలీసులు మళ్లీ నోటీసులు జారీ చేస్తే ఆయన వచ్చే అవకాశం ఉంది. నోటీసులు జారీ చేస్తే పోలీసుల ఎదుట హాజరవుతారు. అప్పుడు అరెస్టు చేయకపోవచ్చని అంటున్నారు. అదే సమయంలో న్యాయపోరాటం కూడా చేయవచ్చు. కానీ ఇప్పుడు బయట కనిపిస్తే పోలీసులు సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేయడానికి అవకాశం ఉంటుంది.అందుకే వ్యూహాత్మకంగా ఆయన ఆజ్ఞాతంలో ఉంటున్నారని అంటున్నారు. మొత్తానికి మోహన్ బాబుకు ఫ్యామిలీ సమస్యలు సమసిపోకుండానే.. ఆవేశంతో మీడియా ప్రతినిధిపై చేసిన దాడి మరో సమస్యగా చుట్టుముట్టింది. 

Also Read : TTD News: శ్రీవారి హుండీల్లో వేసిన సొమ్మునూ నొక్కేస్తారా ? ఈ స్కాంపై విచారణ చేయిస్తే సంచలన విషయాలు

 

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : అమ్మాయిల హత్యలు... శవాలతో సైకో కిల్లర్ దారుణాలు - ఓటీటీలో లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ డోంట్ మిస్
అమ్మాయిల హత్యలు... శవాలతో సైకో కిల్లర్ దారుణాలు - ఓటీటీలో లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ డోంట్ మిస్
Gondhal Oscar Entry : ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీ - 104 సినిమాల లిస్ట్‌లో 'గోంధళ్'... ప్రతిష్టాత్మక అవార్డు దిశగా మరో అడుగు
ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీ - 104 సినిమాల లిస్ట్‌లో 'గోంధళ్'... ప్రతిష్టాత్మక అవార్డు దిశగా మరో అడుగు
Nindu Manasulu Serial Today November 24th: నిండు మనసులు: సంతోషంగా సిద్ధూ, ప్రేరణ! రాజశేఖరం మాస్ వార్నింగ్! ప్రేరణను విజయానంద్ చంపేస్తాడా!
నిండు మనసులు: సంతోషంగా సిద్ధూ, ప్రేరణ! రాజశేఖరం మాస్ వార్నింగ్! ప్రేరణను విజయానంద్ చంపేస్తాడా!
Godavari Serial Today November 24th: 'గోదావరి' సీరియల్: అందరి ముందు మరోసారి పెళ్లి చేసుకున్న సంజు, జాను! మూడు ముళ్లని జాను ఒప్పుకుంటుందా!
'గోదావరి' సీరియల్: అందరి ముందు మరోసారి పెళ్లి చేసుకున్న సంజు, జాను! మూడు ముళ్లని జాను ఒప్పుకుంటుందా!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trainee IPS Harassment Case: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు చేర్చిన పోలీసులు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
MIM Murtuza Pahalwan Murder: శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
లాంచ్‌కు ముందే షోరూమ్‌లో దర్శనమిచ్చిన Bajaj Pulsar 125 Neon.. పాత క్లాసిక్ లుక్‌తో అదరగొడుతున్న బైక్!
తక్కువ ధరలో కొత్త పల్సర్ 125 వస్తోందా? లాంచ్‌కు ముందే కనిపించిన Bajaj Pulsar 125 Neon
Contaminated Drinking Water : కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కార్తీక పౌర్ణమి 2026: ఇంటి పైకప్పుపై ఆకాశ దీపం.. పితృ మోక్షం, శ్రేయస్సు
కార్తీక పౌర్ణమి 2026: ఇంటి పైకప్పుపై ఆకాశ దీపం.. పితృ మోక్షం, శ్రేయస్సు
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ, AI స్టాక్స్‌ భారీ ర్యాలీ
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ
Renigunta Temple Removal: రేణిగుంట ఆలయ తొలగింపుపై భూమన ఆరోపణలు అవాస్తవం.. భక్తుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు: మంత్రి ఆనం
రేణిగుంట ఆలయ తొలగింపుపై భూమన ఆరోపణలు అవాస్తవం.. భక్తుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు: మంత్రి ఆనం
Embed widget