Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు
Pawan Kalyan : పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం తలెత్తింది. ఫేక్ ఐపీఎస్ వెన్నంటి తిరగడం కలకలం సృష్టిస్తోంది.

Pawan Kalyan : పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సమయంలోనే సెక్యూరిటీ లోపం వెలుగులోకి వచ్చింది. నకిలీ ఐపీఏస్ ఆఫీసర్ కలకలం సృష్టించడం కలకలం సృష్టించింది. సమాచారమందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎస్ యూనిఫారమ్ లో వచ్చిన వ్యక్తిని సూర్య ప్రకాష్ గా గుర్తించారు అధికారులు.
ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ కలకలం
ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ఐపీఏస్ ఆఫీసర్ గెటప్ లో ఉన్న ఓ వ్యక్తి ఆయన వెన్నంటే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళితే, అక్కడికి వెళ్లాడు. అంతేకాదు పర్యటన అనంతరం కింది స్థాయి సిబ్బందితోనూ ఆ వ్యక్తి ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. ఆ తర్వాత ఫొటోలు బయటకు రావడంతో అనుమానం వచ్చిన మన్యం జిల్లా పోలీసులు ఎంక్వైరీ చేపట్టారు. ఈ దర్యాప్తులో ఆ వ్యక్తి నకిలీ ఐపీఏస్ ఆఫీసర్ అని తేలడంతో కంగుతిన్నారు. డిసెంబర్ 27న రాత్రి విజయనగరం రూరల్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

సూర్య ప్రకాష్ గా గుర్తింపు
ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ గెటప్ లో వచ్చిన ఆ వ్యక్తిని అధుకారులు గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్య ప్రకాష్ అనే వ్యక్తిగా గుర్తించారు. సూర్య ప్రకాష్ గుర్తింపు ఫేక్ అని తేలడంతో అతనిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే పోలీసులు విచారణ చేపట్టారు. అయితే గత ఏడాదే తాను ఐపీఎస్ కు సెలక్ట్ అయ్యానని సూర్యప్రకాష్ స్థానికులకు చెప్పినట్టు సమాచారం. ట్రైనింగ్ ఉండి పవన్ కళ్యాణ్ పర్యటన కోసం వచ్చానని చెబుతున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అతను నిజంగానే ఐపీఎస్ అధికారా లేదా అన్న వివరాలను ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. సూర్య ప్రకాష్ గతంలో పార్వతీపురం డివిజన్ తూనికలు, కొలతలు విభాగంలో లైసెన్స్డ్ రిపేరర్ గా పని చేసినట్టు పలువురు అంటున్నారు.
వంగలపూడి అనిత సీరియస్
పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపంపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. వెంటనే విచారణకు ఆదేశారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎంకు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడంతో రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగుతున్నాయి.
Also Read : TTD News: శ్రీవారి హుండీల్లో వేసిన సొమ్మునూ నొక్కేస్తారా ? ఈ స్కాంపై విచారణ చేయిస్తే సంచలన విషయాలు





















