చాణక్య నీతి: వీళ్లకు దూరంగా ఉండడం చాలా మంచిదివ్యూహకర్త, పండితుడు,ఉపాధ్యాయుడు, సలహాదారు, ఆర్థికవేత్త అయిన చాణక్యుడి నీతి సూత్రాలు పాటించిన వారికి అపజయం ఉండదంటారుఅయితే చాణక్యుడు రాజకీయాలపై మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి అంశంపై లోతైన జ్ఞానం, అంతర్దృష్టి కలిగి ఉన్నాడు.చాణక్యుడి విధానం ప్రకారం మనిషి జీవితంలో తన శత్రువులను గుర్తించగలిగితే సగం సక్సెస్ అయినట్టే. ముఖ్యంగా ఎవరికి దూరంగా ఉండాలో తెలుసుకోవాలంటాడునైవా పశ్యతి జన్మాంధ్ కమాంధో నైవా పశ్యతి
పుట్టుకతో అంధుడు ఏమీ చూడలేనట్లే..మనపై కోపంగా ఉన్న వ్యక్తికి అది తప్ప ఇంకేం చూడలేడు..అలాంటి వ్యక్తి నుంచి సాయం ఆశించకూడదు..దూరంగా ఉండడం మంచిదిస్వార్థపరుడు కూడా ఎవరిలోను ఎలాంటి మంచి, చెడు రెండూ చూడడు. కేవలం తన పని అయ్యిందా లేదా అన్నట్టే ఉంటాడు. ఇలాంటి వ్యక్తితో సన్నిహితంగా ఉంటే అడ్డంగా మునిగిపోతారువ్యసనపరుడితో స్నేహం ఆర్థిక ఇబ్బందులకు, అనారోగ్యానికి దారితీస్తుంది. అలాంటి వారితో సన్నిహితంగా ఉన్నా, సలహా అడిగినా దానివల్ల నష్టమే కానీ లాభం ఉండదుమత్తు పదార్ధాలకు బానిసైన వ్యక్తి ఎలాంటి వ్యక్తికి అయినా హాని చేయడానికి అస్సలు వెనుకాడడు. అలాంటి వారితో స్నేహం మాత్రమే కాదు శత్రుత్వం కూడా మంచిది కాదు..కేవలం దూరంగా ఉండడమే బెటర్అత్యాశ ఉన్న వ్యక్తి, ఇతరుల పురోగతి చూసి అసూయ చెందే వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఇలాంటి వారినుంచి సహాయం ఆశిస్తే కోలుకోలేనంత నష్టపోతారు.చెడు బుద్ధి ఉండే వ్యక్తులు మీతో మంచిగా ఉన్నట్టే ఉంటారు..సహాయం చేస్తున్నట్టే బయటకు చెబుతారు కానీ వారు ఆశించే ప్రయోజనాలు వేరే ఉంటాయని గుర్తించగలగాలి


Thanks for Reading. UP NEXT

చాణక్య నీతి: ఈ పది విషయాలు గుర్తుంచుకోండి, ఎప్పటికీ ఓడిపోరు

View next story