చాణక్య నీతి: ఇలాంటి సందర్భాల్లో పురుషుడు మళ్లీ పెళ్లిచేసుకోవచ్చు



కుటుంబ వ్యవస్థ గురించి చెప్పిన చాణక్యుడు...పునర్వివాహం గురించి కూడా కొన్ని సూచనలు చేశాడు



స్త్రీ,పురుషులు ఏఏ సందర్భాల్లో మళ్లీ పెళ్లిచేసుకోవచ్చో తన నీతిశాస్త్రంలో వివరించాడు



భార్య పిల్లలను కనలేనిది( గొడ్రాలు) అయినప్పుడు..చాణక్య నీతిశాస్త్రం ప్రకారం ఆ పురుషుడు మళ్లీ పెళ్లిచేసుకోవచ్చు



స్త్రీ పిల్లల్ని కన్నప్పటికీ వంశోద్ధారకుడిని ఇవ్వలేనప్పుడు కూడా పురుషుడు మరో పెళ్లిచేసుకోవచ్చన్నాడు చాణక్యుడు



ఎప్పటికప్పుడు గర్భవిచ్ఛితి జరుగుతున్నప్పుడు పరుషుడు తన వంశం కోసం మరో స్త్రీని వివాహం చేసుకోవచ్చు



అయితే పెళ్లైన 8ఏళ్ల వరకూ భార్యలో పైన పేర్కొన్న సమస్యలున్నప్పటికీ మరో వివాహం చేసుకోరాదు..



ఆ తర్వాత మళ్లీ పెళ్లిచేసుకోవాల్సి వస్తే.. మొదటిభార్యకు భరణంతో పాటూ పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది



అప్పటి పరిస్థితుల ఆధారంగా వివాహవ్యవస్థకు సంబంధించి చాణక్యుడు చెప్పిన విషయాలవి..