ABP Desam


చాణక్య నీతి: ఇలాంటి వాళ్లతో స్నేహం వద్దు


ABP Desam


ఎవరితోనైనా స్నేహం చేసే ముందు ఈ విషయాలని గుర్తు పెట్టుకోండి..!


ABP Desam


అందర్నీ అనుమానించకూడదు..అలాగని అందర్నీ గుడ్డిగా నమ్మకూడదు. అంతా నావాళ్లే అనుకోకూడదు నాకెవ్వరూ లేరనీ బాధపడకూడదు.. అందుకే చాణక్యుడు ఏం చెప్పాడంటే...


ABP Desam


ఓ వ్యక్తితో స్నేహం చేయాలి అనుకున్నప్పుడు కచ్చితంగా ఈ విషయాలను గుర్తుచేసుకోవాలి. వీటిని అనుసరించకపోతే స్నేహం చేసినా ఇబ్బంది పడాల్సి వస్తుంది.


ABP Desam


మీకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వని వ్యక్తితో స్నేహం చేయకూడదు. మంచి స్నేహితుడు అయితే ముందు మీరుచెప్పేది విని మాట్లాడతాడు..అర్థం చేసుకుంటాడు.


ABP Desam


అలా కాదని వాళ్ల ధోరణేదో వాళ్లు చెప్పుకుంటూ వెళ్లిపోయేవారితో స్నేహం అస్సలు మంచిది కాదు


ABP Desam


ఫ్రెండ్ అనే పిచ్చిలో గుడ్డిగా నమ్మొద్దు. ఎందుకంటే స్నేహం,ప్రేమ, బంధం ఎందులోనైనా నమ్మకం చాలా అవసరం. గుడ్డిగా నమ్మేస్తే ఇబ్బంది పడాల్సింది మీరే


ABP Desam


తప్పుడు పనులు చేసేవారికి అస్సలు సహకరించకండి. తప్పు చేసిన వారికన్నా సహకరించేవారిది మరింత తప్పు అని అర్థం చేసుకోవాలి


ABP Desam


మంచి స్నేహితులు...ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయంగా నిలుస్తారు...అది కూడా మీరు అడగకుండా. మీ సమస్య చెప్పాల్సిన అవసరం లేదు..మీ కష్టం చెప్పాల్సిన పనిలేదు


ABP Desam


అందుకే స్నేహం చేసేముందు కచ్చితంగా అన్నీ ఆలోచించుకుని స్నేహం చేయడం మంచిది..అలా చేస్తే ఆ స్నేహం కలకాలం నిలబడుతుంది