అయ్యప్ప సన్నిధిలో 18 మెట్ల దేనికి సంకేతం

ఏటా లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకుని తరిస్తారు. స్వామి ఆలయం ముందున్న 18 మెట్లను ‘పదునెట్టాంబడి’ అంటారు.

ఈ సోపానాలు అధిరోహించడానికి ప్రతి భక్తుడు 41 రోజులు మండల దీక్ష తీసుకుని ఇరుముడి తలపై పెట్టుకుని ఆ మెట్లు ఎక్కుతారు.

4వేదాలు, 2శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం అనే 18 ని దాటిన అయ్యప్ప స్వామి

పట్టబంధాసనంలో కూర్చుని చిన్ముద్ర, అభయహస్తాలతో కనిపించి యోగసమాధిలోకి వెళ్లి జ్యోతి రూపంగా అంతర్ధానం

ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టుమీద ఒక్కో మాయాపాయాన్ని వదిలేయాలని గురుస్వాములు చెబుతారు

మొదటి 5 మెట్లు పంచేంద్రియాలకు సూచన. చూపు ఎప్పుడు మంచివాటిపైనే ఉండాలి, మంచి వినాలి, మంచి మాట్లాడాలి

తర్వాతి 8 మెట్లు అష్టరాగాలు. కామం, క్రోధం, లోభం, మోహం, మధం, మాస్తర్యం, అసూయ, దర్పాన్ని విడిచిపెట్టాలని సూచిస్తాయి.

ఆ తర్వాత 3 మెట్లు సత్వ గుణం, తమోగుణం, రజోగుణానికి సూచిక

చివరి రెండు మెట్లు విద్య- అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. జ్ఞానం పొందేందుకు అవిద్య అనే అహంకారాన్ని వదిలిపెట్టాలి

ఓ మనిషికి ఉండాల్సిన లక్షణాలు, వదిలేయాల్సిన దుర్గుణాల వరకూ అన్నింటికీ ఈ 18 ఓ సంకేతం.

అందుకే 18 కొండలు దాటి 18 మెట్లు ఎక్కిన తర్వాత స్వామి దర్శనం కలుగుతుంది.
స్వామియే శరణం అయ్యప్ప