చాణక్య నీతి: ఈ మూడు లక్షణాలు ఉన్న స్త్రీ నాయకురాలిగా ఎదుగుతుంది

గొప్ప దౌత్యవేత్త, రాజకీయవేత్త ,ఆర్థికవేత్త అయిన ఆచార్య చాణక్యడు తన నీతిశాస్త్రంలో కుటుంబ వ్యవస్థ, నాయకత్వ లక్షణాలు, మనుషుల స్వభావం గురించి చాలా చెప్పాడు

ముఖ్యంగా స్త్రీలు నాయకులుగా ఎదగాలంటే ఎలా ఉండాలో వివరించాడు చాణక్యుడు. ముఖ్యంగా మహిళలకు ఉండే మూడు లక్షణాలు ఆమెను ఉన్నతంగా నిలబెడతాయని చెప్పాడు చాణక్యుడు

అలాంటి లక్షణాలున్న భార్య దొరికితే ఆ పురుషులు అదృష్టవంతులే. అలాంటి వారితో జీవన పయనం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిపోతుంది

వినయం-దయ
వినయం-దయ అనే రెండు లక్షణాలున్న స్త్రీకి సమాజంలో గౌరవం లభించడమే కాకుండా తన కుటుంబానికి సరైన దిశను ఇస్తుంది.

ఇలాంటి మహిళ కుటుంబంలో ఉన్న బంధాలన్నీ సవ్యంగా ఉంచడంలో సహకరిస్తుంది. అదేవిధంగా పిల్లలకు మంచి విలువలు నేర్పించడం ద్వారా వారిని మెరుగైన దారిలో నడిపించి సమాజానికి మంచి పౌరులను అందిస్తుంది.

మతాన్ని అనుసరించడం
ఏదో ఒక మతాన్ని అనుసరించే స్త్రీ..మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని బాగా అర్థం చేసుకుంటుంది. అలాంటి స్త్రీ ధోరణి ఎప్పుడూ సానుకూలంగా ఉంటుంది.

సానుకూల ధోరణి ఉన్న స్త్రీ ఎప్పుడూ తన విధుల నుంచి తప్పుకోదు. అందరి శ్రేయస్సు గురించి ఆలోచిస్తుంది. అలాంటి స్త్రీ కుటుంబం మాత్రమే కాకుండా అనేక తరాలను తన నడవడికతో ప్రభావితం చేస్తుంది.

సంపద
చాణక్య నీతి ప్రకారం సంపదను నిజమైన స్నేహితుడిగా అభివర్ణించాడు చాణక్యుడు. సంపదను నిల్వ చేసే అలవాటున్న స్త్రీ, ఆమె మొత్తం కుటుంబానికి రక్షకురాలు అవుతుంది.

సంపదను నిల్వచేసే అలవాటున్న ప్రతి స్త్రీ...సమయానికి ముందే పరిస్థితులను అంచనా వేయగల సామర్థ్యం ఆమెకు ఉంటుంది. అలాంటి మహిళ భార్యగా దొరికితే ఎటువంటి వారైనా సంక్షోభ సమయాలను సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతారు.

ఈ లక్షణాలున్న స్త్రీ కేవలం కుటుంబానికే కాదు..సమాజానికి కూడా మంచి చేస్తుంది..మంచి నాయకురాలిగా ఎదుగుతుంది

Thanks for Reading. UP NEXT

మార్గశిర మాసంలో గురువారం ఎందుకంత ప్రత్యేకం

View next story