నవంబరు 24 నుంచి మార్గశిరమాసం ప్రారంభమవుతోంది. ఈ మాసంలో వచ్చే గురువారం శ్రీమహాలక్ష్మికి ప్రీతికరమైనదని పరాశర మహర్షి నారదుడికి చెప్పారు. ఈ వ్రతం ఆచరిస్తే అప్పుల బాధలు తొలి సంపద, ఆరోగ్యం కలుగుతుంది
శ్రీ మహా విష్ణువుకు ప్రీతిపాత్రమైన మార్గశిరమాసం అంటే లక్షశ్ర్మీదేవికి మక్కువే. ఈ నెలలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని ఎవరైతే థ్యానిస్తారో వారిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని విశ్వసిస్తారు.
మార్గశిర మాసంలో వచ్చే ప్రతిగురువారం లక్ష్మీపూజ చేస్తారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు కళకళలాడే ముగ్గులు వేసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి.
తలకి స్నానం చేసి దేవుడి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి యధావిథిగా గణపతిని పూజించి అనంతరం అమ్మవారికి దీప,ధూప,అష్టోత్తరం , నైవేద్యంతో స్త్రీసూక్తం విధానంలో షోడసోపచార పూజ చేయాలి.
పూజా విధానం మొత్తం తెలియని వారు కనీసం దీపం పెట్టుకుని అమ్మవారి అష్టోత్తరం చదువుకుని నైవేద్యం సమర్పించినా చాలంటారు పండితులు
”ఓం మహాలక్ష్మీ చ విద్మహ విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్” అనే మంత్రాన్ని పఠించాలి. పూజ పూరైన తర్వాత నైవేద్యం సమర్పించి అప్పుడు లక్ష్మీవారవ్రత కథ చెప్పుకు ని అక్షతలు తలపై వేసుకోవాలి
అమ్మవారికి ఏ వారం ఏ నైవేద్యం 1 వ గురువారం – పులగం 2 వ గురువారం – అట్లు, తిమ్మనం
3 వ గురువారం – అప్పాలు, పరమాన్నం 4 వ గురువారం – చిత్రాన్నం, గారెలు 5 వ గురువారం – పూర్ణం బూరెలు
ఐదవ వారం ఐదుగురు ముత్తయిదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. దక్షిణ తాంబూలం ఇచ్చి వారి ఆశీస్సులు పొందాలి.