చాణక్య నీతి: యవ్వనంలో ఈ 3 విషయాలకు దూరంగా ఉండాలి



యువత చాలా విషయాల్లో పరధ్యానంగా వ్యవహరిస్తుంటారు..అయితే కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్ లో బాధపడాల్సిన అవసరం రాదంటాడు చాణక్యుడు



దేశ పురోగతిలో యువతదే ముఖ్యమాత్ర...వారి దిశే దేశ పరిస్థితిని నిర్ణయిస్తుంది. వారు సరిగ్గా లేకుంటే వారి భవిష్యత్ మాత్రమే కాదు..దేశ భవిష్యత్ కూడా నాశనమవుతుంది



యవ్వనంలో ఉన్నప్పుడు మీరు అనుసరించే విధానాలే దేశాభివృద్ధిపై ప్రభావం చూపుతాయి. అవే విధానాలు మీ భవిష్యత్ ని కూడా నిర్ధేశిస్తాయన్నాడు చాణక్కుడు



ముఖ్యంగా యవ్వనంలో ఓ మూడు విషయాలకు దూరంగా ఉంటే..మీ వృధ్దాప్యం సంతోషంగా గడిచిపోతుందంటాడు చాణక్యుడు



తప్పుడు సహవాసం
ప్రతి వ్యక్తిపై సహవాసాల ప్రభావం ఉంటుంది. చెడు పనులు చేసే వ్యక్తుల సహవాసం తప్పుడు మార్గంలో వెళ్లేలా ప్రభావితం చేస్తుంది. కామం, పోరు, మత్తు మొదలైన అంశాలు వ్యక్తి లక్ష్యాన్ని సాధించడంలో అవరోధాలు.



మత్తు, కామానికి బానిసైన వ్యక్తి ఆలోచించే..అర్థం చేసుకునే సామర్థ్యం కోల్పోతాడు. జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడు. యవ్వనంలో వీటికి దూరంగా ఉంటే ఆర్థికంగా సక్సెస్అవుతారు,కుటుంబ బంధాలు బావుంటాయి..తద్వారా వృద్దాప్యం కూడా సంతోషంగా గడిచిపోతుంది



సోమరితనం
యవ్వనంలో కష్టపడితే ముసలితనం బాగుంటుందని అంటారు. సోమరితనం రూపంలో శత్రువు ఒక వ్యక్తి పురోగతిని అడ్డుకునే వయస్సు ఇది, దానిని అధిగమించిన వ్యక్తిని విజయం సాధించకుండా ఎవరూ ఆపలేరు.



యవ్వనంలో సమయం విలువను అర్థం చేసుకున్న వ్యక్తి, అతని భవిష్యత్తు ఎప్పుడూ దుఃఖంతో ముగియదు. సోమరులకు జ్ఞానం లభించదు...జ్ఞానం లేకుండా డబ్బు లభించదు. డబ్బు లేని జీవితం ఎప్పటికీ పోరాటంతో గడిచిపోతుంది. అందుకే సోమరితనం వీడాలి



కోపం
కోపంతో పని జరగదు సరికదా మరింత చెడిపోతుంది. యవ్వనంలో ఉడుకురక్తం సర్వసాధారణం..దాన్ని అధిగమిస్తేనే పురోగతికి మార్గం సులభం అవుతుంది



కోపం బుద్ధిని పాడు చేస్తుంది. తన అనుకున్నవారంతా దూరమవుతారు. మీకోపం క్రమంగా మిమ్మల్ని ఒంటరిని చేస్తుంది. దీన్ని శత్రువులు సద్వినియోగం చేసుకుంటారు..తద్వారా మీ కష్టం నాశనమై విజయానికి దూరమైపోతారు..