చాణక్య నీతి: రాజు నియమించే గూఢచారులు ఇలా ఉండాలి

గొప్ప వ్యూహకర్త, ఆర్థికవేత్త అయిన చాణక్యుడు తన విధానాల బలంతో నంద వంశాన్ని నాశనం చేసి...చంద్రగుప్త మౌర్యను మగధ చక్రవర్తిగా చేశాడు.

చాణక్యుడికి రాజకీయాల గురించి మాత్రమే కాదు సమాజంలోని ప్రతి విషయం గురించి లోతైన జ్ఞానం, అంతర్దృష్టి ఉంది . అందుకే ఇప్పటికీ ఎందరో పాలుకులు, నాయకులు వీటిని అనుసరిస్తుంటారు

ముఖ్యంగా పరిపాలనా వ్యవస్థలో గూఢచారి వ్యవస్థకు చాలా ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు చాణక్యుడు. వారి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా ప్రభువు తన పరిపాలనా విధానంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

చాణక్యుడు చెప్పిన గూఢచారుల్లో రకాలు
1. కాపాటిక 2. ఉదాస్థిత 3.గృహపాటిక 4.వైదిహిక 5.తాపస

కాపాటిక
మంచి వక్తగా, విద్యాలయంలో చదువుతున్న విద్యార్థిగా ఉన్నట్టు అందర్నీ నమ్మిస్తాడు. తాను తెలుసుకుని చెప్పాల్సిన విషయాలు ప్రభువుకి చేరవేస్తాడు

ఉదాస్థిత
ఎప్పుడూ ఏకాంతంగా ఉండే సన్యాసులుగా ఉంటారు. అపారమైన జ్ఞానం, తెలివి వీరి సొంతం. ఎవ్వరికీ అనుమానం రాకుండా రాజ్యంలో ఉండే సమస్యలు, ప్రజల అభిప్రాయాలు సేకరించి రాజుకి చేరవేస్తారు.

గృహపాటిక
బీదరైతుగా ఉంటూ కావాల్సిన సమాచారం సేకరిస్తాడు

వైదేహిక
ఇంటింటికీ తిరుగుతూ వస్తువులు విక్రయించే బీద వ్యాపారిగా ప్రజల మధ్య ఉంటూ అభిప్రాయసేకరణ చేపడతాడు

తాపస
మునీశ్వరుడి వేషంలో తిరుగుతూ ప్రజల గౌరవాన్ని పొందుతూ విషయ సేకరణ చేస్తాడు