చాణక్య నీతి: అక్రమ సంబంధాలకి చాణక్యుడు చెప్పిన శిక్షలివే!
ఆచార్య చాణక్యుడు..గొప్ప వ్యూహకర్త, పండితుడు, ఉపాధ్యాయుడు, సలహాదారుడు, ప్రాచీన భారతదేశపు ఆర్థికవేత్త...మౌర్య వంశం విజయం వెనుక చాణక్యుడి దౌత్యం ఉంది.
కేవలం రాజకీయాల గురించి మాత్రమే కాదు సమాజంలోని ప్రతి విషయం గురించి లోతైన జ్ఞానం, అంతర్దృష్టి ఉంది .
రాజకీయాలు, ఆర్థిక విధానాల గురించి మాత్రమే కాకుండా కుటుంబం, విలువల గురించి కూడా చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు
ముఖ్యంగా కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే అక్రమ సంబంధించి చాణక్యుడు చాలా క్రూరమైన శిక్షలు ప్రతిపాదించాడు
ఓ విద్యార్థి గురుపత్నితో( అప్పట్లో గురువుగారి ఇంట్లోనే విద్యాభ్యాసం)అక్రమ సంబంధం పెట్టుకుంటే పురుషావయవం ఖండించి ప్రాణం తీయడమే శిక్ష
ఆశ్రమంలో ఉండే సన్యాసినులతో అక్రమం సంబంధం పెట్టుకుంటే 24 ఫణములు అపరాధ రుసుము. ఇందుకు అంగీకరించిన సన్యాసినికి కూడా అపరాధ రుసుము చెల్లించాలి
రాజుగారు కాకుండా మరో పురుషుడెవరైనా రాణిగారిని ముగ్గులోకి దించితే.. ఆ వ్యక్తిని బాగా మరుగుతున్న వేడినీళ్లలో వేసి చంపడమే శిక్ష
తనవద్ద బానిసగా పనిచేస్తున్న పురుషుడితో స్త్రీ లైంగిక సంబంధం పెట్టుకుంటే ఆమెను ఉరితీయడమే శిక్ష
ఒక పురుషుడు..తండ్రి సోదరితోకానీ, తల్లి సోదరితోకానీ, మేనమామ భార్యతో కానీ , కోడలు, కుమార్తె, సోదరితో కానీ అక్రమ లైంగిక సంబంధం పెట్టుకుంటే పురుషాంగం ఖండించి ఆ తర్వాత చంపడమే శిక్ష.
ఇలాంటి పురుషుడికి సహకరించిన స్త్రీకి ఉరిశిక్ష..ఇంకా ఇలాంటి శిక్షలు చాలా చెప్పాడు చాణక్యుడు