చాణక్య నీతి: ఈ పది విషయాలు గుర్తుంచుకోండి, ఎప్పటికీ ఓడిపోరు



1.మూర్ఖులతో ఎన్నడూ వాదించవద్దు ఎందుకంటే అలా చేయడం ద్వారా మన సమయం వృధా అయినట్టే



2.భగవంతుడు మీ భావన ఆత్మ ఆలయం..దేవుడు మీ మనస్సులో ఉన్నాడు విగ్రహాలలో కాదని గుర్తుంచుకోండి



3.అప్పులు, శత్రువులు, వ్యాధులను ఎప్పుడూ చిన్నగా చూడకూడదు.. వీలైనంత త్వరగా పరిష్కరించాలి



4.క్లిష్ట సమయాల్లో కూడా మీ లక్ష్యం పట్ల మీరు దృఢంగా ఉంటేనే అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది



5.మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి మీరు చెప్పిన విషయం కన్నా చుట్టూ గమనించడంలో బిజీగా ఉంటే అలాంటి వ్యక్తి నమ్మదగినవాడు కాదని తెలుసుకోండి



6.తన తప్పుల నుంచే కాదు...ఇతరుల తప్పుల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలి..అప్పుడే విజయం సాధించగలరు



7.ఎప్పుడూ అదృష్టంపై ఆధారపడకండి..కష్టానికి ఫలితం వెంటనే కాకపోయినా ఎప్పటికైనా అందుతుంది



8.ఏ వ్యక్తి తానున్న హోదా, స్థానం బట్టి ఉన్నతుడు కాలేడు..కేవలం తన లక్షణాల వల్ల మాత్రమే ఉన్నతుడు



9.మిమ్మల్ని గౌరవించని చోట మీరు నివసించకూడదు



10.ఒక సువాసనగల చెట్టు అడవి మొత్తానికి పరిమళం పంచినట్టు..వంశం పేరు ఒక పుణ్యాత్ముడి కారణంగా ప్రకాశిస్తుంది