అన్వేషించండి
Advertisement
Leo horoscope 2023 :సింహ రాశివారికి 2023లో ఆ మూడు నెలలు మినహా ఏడాదంతా అద్భుతమే!
Leo horoscope 2023 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Leo horoscope 2023 : సింహ రాశి వారు సంవత్సరం ప్రారంభంలోనే చాలా మార్పులు గమనిస్తారు. శని 6వ ఇంటి నుంచి 7వ ఇంటికి చేరుకుంటాడు.
సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి ఎనిమిదో స్థానంలో ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. ఏప్రిల్లో శుక్రుడు తొమ్మిదో స్థానంలో సంచరిస్తాడు..ఫలితంగా కెరీర్‌లో పురోగతి ఉంటంది. ఆ తర్వాత బృహస్పతి-రాహువు కలయిక వల్ల మీకు కొన్ని ఇబ్బందులు తప్పవు..ఈ ఏడాది ఓవరాల్ గా సింహరాశివారికి ఎలా ఉందో చూద్దా...
- సంవత్సరం ప్రారంభంలో ఆరవ ఇంట్లో ఉన్న శని మీ ప్రత్యర్థులను ఓడించడానికి, కోర్టు విషయాల్లో విజయాన్ని సాధించడంలో మీకు సహాయం చేస్తుంది. జనవరి 17న ఏడవ స్థానానికి మారుతుంది. ఇది కూడా మీకు వ్యాపారంలో లాభాలనిస్తుంది. విజయావకాశాలు పెంచుతుంది. వైవాహిక జీవితంలో అనుకూలమైన పరిస్థితి ఉంటుంది.
- సంవత్సరం ప్రారంభంలో కెరీర్లో మార్పులుంటాయి. మంచి పురోగతి ఉంటుంది
- కొత్త ఏడాదిలో సింహరాశివారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది. సూర్యసంచారం వల్ల తెలివితేటలు పెరుగుతాయి
- ఏడాది ఆరంభంలో సంతోషం ఉన్నప్పటికీ రానురాను సమస్యలు పెరుగుతాయి. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇబ్బందులుంటాయి. కుజుడి సంచారం వల్ల కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది.
- వైవాహిక జీవితం బాగానే ఉంటుంది కానీ..జీవిత భాగస్వామి అనారోగ్యం మిమ్మల్ని కొంత బాధిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది.
- ఆరోగ్య పరంగా నిర్లక్ష్యం వహించవచ్చు. సూర్యుడు, బుధుడు 5 వ ఇంట్లో, శని-శుక్రుడు 65 వస్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోకతప్పదు
సింహరాశి వారి నెలవారీ ఫలితాలు@2023
- జనవరిలో మీకు ఆర్థిక ఒడిదొడుకులు ఉంటాయి..కానీ వాటని అధిగమించగలుగుతారు. వివాదాల నుంచి బయటపడతారు
- ఫిబ్రవరిలో శని-శుక్రుడు కలయిక వల్ల ఈ రాశివారికి చిన్న చిన్న సమస్యలు తప్పవు. ఉద్యోగం, వ్యాపారంలో చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబంలో ఒకరికి అనారోగ్య సమస్యలు ఉంటాయి
- మార్చి నెల ప్రారంభం కాగానే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
- ఏప్రిల్ చివరి నాటికి అదృష్టం కలిలొస్తుంది. చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, జీవితంలో సానుకూల మార్పు వస్తుంది
- మే లో సింహరాశి వారికి కెరీర్‌లో లాభాలు వచ్చే రోజు. ఇది కాకుండా, 10వ ఇంట్లో సూర్యుడు ఉండటం మీ కెరీర్‌లో కొత్త మార్పులను తెస్తుంది.ఉద్యోగంలో మంచి మార్పులు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
- జూన్ లో ఆర్థిక లాభాలను పొందుతారు. మీ ప్రయత్నాలన్నీ విజయవంతమై జీవితం ఆనందంతో నిండిపోతుంది
- జూలైలో మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి
- ఆగస్టు నెలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి
- సెప్టెంబరులో ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పు వస్తుంది. బాగా సంపాదిస్తారు. అయితే ఈ సమయంలో మాటల్లో సంయమనం పాటించడం, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది
- అక్టోబర్ నెల మీరు మీ లక్ష్యాలను సాధించే సమయం. ప్రభుత్వ స్థాయిలో మీరు ఆశించిన సహాయం అందుతుంది. మరింత ధైర్యం, మనోబలంతో ముందుకు సాగుతారు
- నవంబర్ నెలలో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కానీ వాటినుంచి బయటపడతారు
- డిసెంబర్ లో మీరు జీవితంలో హెచ్చు తగ్గులు అనుభవించవచ్చు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాల్సిన సమయం ఇది. పిల్లలు చదువుపై దృష్టిని కోల్పోయే కాలం కూడా...అందుకే జాగ్రత్తగా ఉండాలి
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
రాజమండ్రి
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion