చాణక్య నీతి: మనిషిని జీవితంలో బాధించే మూడు దురదృష్టాలుఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, న్యాయశాస్త్రం..ఇలా ఎలాంటి సమస్యకైనా పరిష్కార మార్గం చూపాడు చాణక్యుడు.ఎన్ని కష్టాలను అయినా అధిగమించవచ్చు కానీ ..జీవితంలో ఈ మూడు దురదృష్టాలు ఉండకూడదని చెప్పాడు చాణక్యుడు1.వృద్ధాప్యంలో ఉండగా భార్య మరణించడం
2. ఆస్తిని స్నేహితుడు అపహరించడం
3. తిండి తినే విషయంలో స్వాతంత్ర్యం లేకపోవడంఅనుక్షణం వెన్నంటే ఉండి అన్ని అవసరాలు తీర్చే భార్య ఉన్నంతవరకూ ఆ లోటు కనిపించకపోయినా ఆమె శాశ్వతంగా దూరమయ్యాక మాత్రం ఆ లోటు స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా వృద్ధాప్యంలోపిల్లలకు రెక్కలొచ్చి ఎగిరిపోతారు..మనవలు వారి సందడిలో వారుంటారు..పలకరించే దిక్కుండదు, ప్రేమగా పట్టించుకునే వారు ఉండరు. పని చేసుకునే ఓపికా ఉండదు.. అందుకే వృధాప్యంలో భార్య మరణించడం కన్నా దురదృష్టం మరొకటి ఉండదంటాడు చాణక్యుడుస్నేహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరైన స్నేహితుడి అండ ఉంటే చాలు అనుకోని వారుండరు.. కానీ నమ్మిన స్నేహితుడే మోసం చేస్తే..మీరు మనిషిని గుర్తించడంలో లోపమా..వారిలో స్వార్థమా.. కారణం ఏదైనా స్నేహితుడి కారణంగా ఆర్థిక నష్టం ఎదుర్కోవడం, ఆస్తిని తను లాక్కోవడం అేది టాప్ 3 దురదృష్టాల్లో మరొకటిఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా జానెడు పొట్టకోసమే... కానీ కడుపునిండా తినే పరిస్థితి లేదంటే అంతకన్నా దురదృష్టం ఏముంటుంది..కడుపునిండా తినలేకపోవడం అంటే రోగాలతో బాధపడడం ఒకటైతే..నువ్వు ఎంత సంపాదించినా నీకు నచ్చినది తినగలిగే స్వాతంత్ర్యం నీ ఇంట్లో నీకు లేకపోవడం.. ఇంతకు మించిన దురదృష్టం ఏముంటుంది...


Thanks for Reading. UP NEXT

చాణక్య నీతి: వీళ్లకు దూరంగా ఉండడం చాలా మంచిది

View next story