Maha Shivaratri 2024: శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటే!
Maha Shivaratri 2024: శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే మాట వినే ఉంటారు..అంటే ..సృష్టిలో ప్రతి కదలికా పరమేశ్వరుడి కనుసన్నల్లోనే జరుగుతుందని అర్థం..అదెలా సాధ్యం?
![Maha Shivaratri 2024: శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటే! Maha Shivaratri 2024 Lord Siva and His Worship Shiva tattva and his innovations Shiv tattva Maha Shivaratri 2024: శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/08/910c64128f29940c956f0f5b0cca38821707372402139217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Maha Shivaratri 2024: కొత్తగా ఏదైనా కనిపెట్టిన వారిని ఆవిష్కర్తలు అంటాం. అయితే సృష్టిలో మొదటి ఆవిష్కర్త శివుడు అనే చెప్పాలి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా.. అంటే సమస్త ప్రపంచం ఈశ్వరమయం అనే కదా. అంటే పుట్టుక నుంచి మరణానంతరం చేరుకునే శ్మశానం వరకూ మన ప్రతి చర్యలోనూ, నేర్చుకునే ప్రతి విద్యలోనూ శంకరుడున్నాడు.. అన్నీ ఆయన అందించనవే..ఆయన కనుసన్నల్లో నడుస్తున్నవే..అందుకే సర్వం ఈశ్వర మయం అంటారు.
భాషకు మూలమైన సూత్రాలు
సృజనశక్తికి, భావవ్యక్తీకరణకు ఆధారం భాష. అలాంటి భారతీయ భాషలకు మూలమైన 14 సూత్రాలు ఢమరుక నాదం నుంచి సృష్టించాడు శివుడు
వర్ణ సమ న్యాయం అందించిన శివుడికి కృతజ్ఞతగా అక్షరాభ్యాసం రోజు ‘‘ఓం నమఃశివాయ సిద్ధం నమః’’అని మొదటగా రాయిస్తారు.
Also Read: ఈ అమావాస్య నుంచి కొన్ని రాశులవారికి మంచి రోజులు మొదలవుతున్నాయ్!
యోగ విద్య
యోగవిద్యను మొదటగా పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించి.. స్త్రీలకు బ్రహ్మవిద్యోపదేశానికి మార్గదర్శి అయ్యాడు
సప్త స్వరాల సృష్టికర్త
సంగీత విద్యకు మూలం సప్తస్వరాలు. అందులోని షడ్జమం(నెమలి) ,రిషభం (ఎద్దు), గాంధారం (మేక), మధ్యమం (గుర్రం) ,పంచమం (కోకిల), దైవతం (కంచరగాడిద), నిషాదం (ఏనుగు), ఈ ఏడింటి ధ్వనుల స్వభావంతో సంగీతవిద్యను శివుడు ఆవిష్కరించాడు.
నృత్య విద్య
‘శివ తాండవం’ ద్వారా ‘నృత్యవిద్య’ను జగత్తుకు అందించాడు.
Also Read: అమ్మవారి వెంటే అయ్యవారు, ఇంత ప్రేమ పొందడం ఎవరికి సాధ్యం!
నిరాడంబర జీవితం
దైవత్వానికి, ఆధ్యాత్మికతకు నిరాడంబర జీవనమే ప్రాతిపదిక అని ప్రపంచానికి తెలిపేందుకు తాను అలాగే జీవించి చూపించాడు
స్త్రీకి గౌరవం
తనలో సగభాగం పార్వతీదేవికి పంచి ఇచ్చి...గంగను తలపై మోసి స్త్రీకి ఎంత గౌరవం ఇవ్వాలని చాటిచెప్పాడు
తంత్ర విద్య
సమాజంలో భేదాలను రూపుమాపేందుకు శివతత్వం ప్రతిపాదించాడు. ‘ఆత్మగోత్రం పరిత్యజ్య శివగోత్రం పవిశతు’ అంటూ స్వాభిమానం కలిగించే గోత్రాలను వదిలిపెట్టి శివగోత్రం స్వీకరించమని ప్రబోధించాడు. శవాలను ముట్టుకుని శరీరధర్మ విజ్ఞానం తెలిపేందుకే తంత్ర విద్య ప్రవేశపెట్టాడు
నిర్గుణత్వానికి ప్రతీక
గుణహీనుడని, నిర్గుణుడని నిందించిన దక్ష ప్రజాపతి మాటలకు సమాధానంగా ‘లింగ’ రూపం ధరించి నిర్గుణ స్వభావాన్ని లోకానికి అందించాడు. అంటే లింగంపై ఎన్ని అభిషేకాలు చేసినా ఏవీ నిలబడకుండా చేసి తన దగ్గర ఏదీ ఉంచుకోననే సందేశం అందించాడు.
Also Read: సరదాగా శివుడి కళ్లు మూసిన పార్వతీ దేవి - ఆ క్షణం ఏం జరిగిందంటే!
మోక్ష విద్య
నిర్గుణతత్వానికి ‘శివలింగం’ ప్రతీక అయితే, సంపూర్ణ గురుస్వరూపానికి దక్షిణామూర్తి నిదర్శనం. అత్యద్భుతమైన మోక్ష విద్యను అందించిన దక్షిణామూర్తి ఆది గురువయ్యాడు.
ఇంతకు మించిన ఆవిష్కర్త ఎవరుంటారు...అందుకే ఈ శ్లోకం చెబుతారు
ఈశాన స్సర్వవిద్యాన మీశ్వర సర్వ భూతానాం|
బ్రహ్మాధిపతి బ్రహ్మణాధిపతి బ్రహ్మశివోమే అస్తు సదాశివోం||
సర్వ విద్యలకు అధిపతి ఈశానుడు. సర్వ భూతాలకూ / ప్రాణులకూ అధిపతి ఈశ్వరుడు. బ్రహ్మము అంటే బ్రహ్మకు ప్రభువు, భ్రాహ్మణములకు అంటే వేదాలకు అధిపథి శివుడు. అలాంటి సదాశివుడు నాకు శుభములను ఒసగుగాక అని ఈ శ్లోకానికి అర్థం .
"సర్వం శివ మయం జగత్"
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)