అన్వేషించండి

Mauni Amavasya 2024 Astrology: ఈ అమావాస్య నుంచి కొన్ని రాశులవారికి మంచి రోజులు మొదలవుతున్నాయ్!

Mauni Amavasya 2024 : ఫిబ్రవరి 09 శుక్రవారం పుష్యమాస అమావాస్య. ఈ రోజునే సర్వేషాం అమావాస్య, చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజు నుంచి ఈ రాశులవారికి మంచి రోజులు మొదలవుతున్నాయ్!

Mauni Amavasya 2024 Astrology:  ఏటా పుష్యమాసం ఆఖరి రోజు అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అంటారు. ఏడాది పొడవునా వచ్చే అమావాస్యల కన్నా చొల్లంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యం ఉందని చెబుతారు. ఈ సమయంలో బుధుడు మకరరాశిలో సంచరిస్తున్నాడు.ఈ ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది.  ఈ సమయంలో కొన్ని రాశులవారికి శుభ ఫలితాలున్నాయి. 

మేష రాశి

మీలో  ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. భూమి , వాహన ఆనందాన్ని పొందుతారు. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. స్నేహితుల సహకారంతో వృత్తిలో వస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి.  మీ తల్లిదండ్రులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. పెద్ద ప్రాజెక్ట్‌లలో ఏదైనా విజయవంతం అవుతారు. అన్నింట్లో ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు.

Also Read: ఫిబ్రవరి 9 మౌని అమావాస్య, ఈ రోజు ఇవి పాటించడం మర్చిపోవద్దు!

వృషభ రాశి

వ్యాపారంలో లాభం ఉంటుంది. కెరీర్‌లో అఖండ విజయాన్ని పొందుతారు. ఉద్యోగంలో స్థలం మారే అవకాశాలు ఉన్నాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. అప్పులు తగ్గుతాయి. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు.  కొత్తగా ప్రారంభించే పనులు ఆర్థికంగా ఓ మెట్టు ఎక్కుతారు. తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.

కర్కాటక రాశి

కొత్త ఆదాయ వనరుల నుంచి డబ్బు వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి అవకాశం ఉంటుంది. మీరు పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.  మీరు ఒకరి పట్ల ఆకర్షితులవుతారు. అవివాహితులు కొత్త భాగస్వామిని వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీరు  మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ప్రతిపాదనను పొందవచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో పురోగతి ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.  

Also Read: ఈ ఏడాది 3 నెలలు మూఢం, ఈ టైమ్ లో శుభకార్యాలు ఎందుకు నిర్వహించకూడదు!

కన్యా రాశి

గత కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యలు ఈ అమావాస్య తర్వాత నుంచి నెమ్మదిగా పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉంటాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వస్తుసౌఖ్యాలు, సంపదలు పెరుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.

వృశ్చిక రాశి

మౌని అమావాస్య  రోజు మీ కెరీర్లో మంచి పురోగతి ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది. నూతన ఆదాయ మార్గాలు వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. జీవితంలో కొత్త సంతోషం లభిస్తుంది. 

మకర రాశి

ఈ రోజు కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం లభిస్తుంది. మీ జీతంలో పెరుగుదల ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగుపడుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. మౌని అమావాస్య రోజు మీరు చేపట్టే కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి. 

Also Read: భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఆచరించకూడని విధులివే!

మీన రాశి

అమావాస్య రోజు మీరు గుడ్ న్యూస్ వింటారు. వ్యాపారం, ఉద్యోగం, విద్యలో ఈ రోజు నుంచి అన్నీ సానుకూల మార్పులను గమనిస్తారు. ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఆదాయంతో పాటూ ఆనందం కూడా పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది. 

Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే

గమనిక:  ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.  

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Polavaram Project: పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
Nagababu Latest News: నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
Nara Lokesh News: ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
Tirumala News: తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP DesamShardul Thakur Bowling Strategy vs SRH IPL 2025 | కాన్ఫిడెన్స్ తోనే సన్ రైజర్స్ కు పిచ్చెక్కించాడుShardul Thakur 4Wickets vs SRH | IPL 2025 లో పర్పుల్ క్యాప్ అందుకున్న శార్దూల్ విచిత్రమైన కథ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram Project: పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
Nagababu Latest News: నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
Nara Lokesh News: ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
Tirumala News: తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
Telangana Crime News: డిన్నర తర్వాత నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి- కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన తల్లి
డిన్నర తర్వాత నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి- కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన తల్లి
Pakistani Latest News: విమానాశ్రయాలు, విమానాల్లో ఫొటోలు, వీడియోలు నిషేధం- కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
విమానాశ్రయాలు, విమానాల్లో ఫొటోలు, వీడియోలు నిషేధం- కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
David Warner in Robinhood: 'రాబిన్ హుడ్'లో వార్నర్ ఎంట్రీ అదుర్స్ - కనిపించేది కొద్దిసేపే అయినా.. ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదంతే..
'రాబిన్ హుడ్'లో వార్నర్ ఎంట్రీ అదుర్స్ - కనిపించేది కొద్దిసేపే అయినా.. ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదంతే..
US And Bangladesh Arms Deal: బంగ్లాదేశ్‌కు భారీగా ఆయుధాలు అమ్మేందుకు అమెరికా డీల్! భారత్‌ ఇప్పుడు ఏం చేయాలి?
బంగ్లాదేశ్‌కు భారీగా ఆయుధాలు అమ్మేందుకు అమెరికా డీల్! భారత్‌ ఇప్పుడు ఏం చేయాలి?
Embed widget