Moodami 2024: మూఢం వచ్చేస్తోంది మూహుర్తాలు పెట్టేసుకోండి త్వరగా - అసలు మూఢంలో శుభకార్యాలు ఎందుకు నిర్వహించకూడదో తెలుసా!
Moodami 2024: మౌఢ్యం/ మూఢం అంటే ఏంటి? ఇవి ఎందుకొస్తాయి? మూఢాలతో సమస్యేంటి? ఈ రోజుల్లో శుభకార్యాలు చేయొద్దని అంటారెందుకు? ఏఏ కార్యాలు చేయకూడదు -ఏం చేయొచ్చు? శుభకార్యాలు చేస్తే ఏమవుతుంది?
Guru Moodam Shukra Moodam: 2024 లో పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ 26 వరకు ఉన్నాయి. తిరిగి ఆగష్టు 8 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఉన్నాయి. ఈ మధ్యలో అంటే ఏప్రిల్ 27 నుంచి ఆగష్టు 8 వరకూ దాదాపు మూడునెలలు మూఢం.
శుక్రమూఢమి : 2024 ఏప్రిల్ 27 నుంచి జూలై 11 వరకు
గురుమూఢమి: 2024 మే 07 నుంచి జూన్ వరకు
కొన్ని పంచాంగాల్లో డేట్స్ ఓ రెండు రోజులు అటు ఇటు ఉంటాయి..
మూఢం అంటే?
నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. వీటిలో భూమికూడా ఓ గ్రహమే. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమ్మీద ఉన్నవారికి కనపడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అంటారు.
Also Read: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నక్షత్రాల వారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే మొత్తం శూన్యమే!
గురు మౌఢ్యమి - శుక్ర మౌఢ్యమి
గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం, శుక్రడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యం వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి. సూర్యునికి దగ్గరగా గురు , శుక్రులు వచ్చి నప్పుడు , గురు శుక్రుల శక్తులు తగ్గి బలహీనమైపోతాయి, నీరసపడతాయి, వాటి శక్తి సన్నగిల్లుతుంది. అంటే వేయి వాట్స్ బల్బు ముందు క్యాండిల్ పెడితే , ఆ క్యాండిల్ శక్తి ఎంత మామూలుగా ఉంటుందో అలాగే సూర్యుడి దగ్గరగా చేరిన గ్రహాల స్థితి అంతే బలహీనంగా ఉంటుంది. గురు, శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెబుతారు. ఎందుకంటే ఏ శుభకార్యానికి అయినా గురు, శుక్ర గ్రహాల బలమే ప్రధానం... ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలసిరాదన్నది పండితుల మాట.
ఉగాది 2024 - 2025 క్రోధి నామ సంవత్సరం మేష రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
మూఢంలో ఏఏ కార్యాలు నిర్వహించకూడదు
- శుభగ్రహాలైన గురు, శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి మూఢాల్లో వివాహాది శుభ కార్యాలు జరపకూడదు
- లగ్నపత్రిక రాసుకోకూడదు, వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదు
- పుట్టు వెంట్రుకలు తీయించరాదు
- గృహ శంకుస్థాపనలు చేయ రాదు
- ఇల్లు మారకూడదు
ఉగాది 2024 - 2025 క్రోధి నామ సంవత్సరం వృషభ రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
మూఢంలో ఇవి చేసుకోవచ్చు
- అన్న ప్రాసన చేసుకోవచ్చు
- ప్రయాణాలు చేయవచ్చు
- ఇంటి రిపేర్లు చేసుకోవచ్చు
- భూములు కొనడం , అమ్మడం , అగ్రిమెంట్లు చేసుకోవడం చేయొచ్చు
- నూతన ఉద్యోగాల్లో చేరొచ్చు, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లొచ్చు
- నూతన వాహనాలు కొనుగోలు చేయొచ్చు, నూతన వస్త్రాలు కొనుక్కోవచ్చు
ఉగాది 2024 - 2025 క్రోధి నామ సంవత్సరం మిథున రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
మూఢాల కాలంలో శుభ కార్యాలు నిర్వహిస్తే ఏమవుతుంది?
మహర్షులు, జ్యోతిష్య శాస్త్ర పండితులు, అనుభవస్తులు చెప్పిన దాని ప్రకారం మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం వినాల్సి రావొచ్చు. కష్టం కలుగవచ్చు , నష్టం వాటిల్లవచ్చు. అందుకే మూఢం సమయంలో ఏ శుభకార్యం తలపెట్టరు.