సప్త సముద్రాలంటే ఇవే!

సప్త సముద్రాలు అనే మాట తరచూ వింటుంటాం.. అవేంటి? ఎక్కడున్నాయ్?

లవణ (ఉప్పు) సముద్రం
ఇది జంబూ ద్వీపాన్ని చుట్టి ఉంది. లవణ అవతల వైపు ప్లక్ష ద్వీపం

ఇక్షు (చెరకు) సముద్రం
ఇది ప్లక్ష ద్వీపాన్ని చుట్టి ఉంది. ఇక్షుకి ఆవల శాల్మలీ ద్వీపం

సురా (మద్యం/ కల్లు) సముద్రం
ఇది శాల్మలీ ద్వీపాన్ని చుట్టి ఉంది. సురకు ఆవల కుశ ద్వీపం

సర్పి (ఘృతం/ నెయ్యి) సముద్రం
ఇది కుశ ద్వీపాన్ని చుట్టి ఉంది. ఘృతకు ఆవల క్రౌంచ ద్వీపం

క్షీర (పాల) సముద్రం
ఇది క్రౌంచ ద్వీపాన్ని చుట్టి ఉంది. క్షీరకు ఆవల శాక ద్వీపం

దధి (పెరుగు) సముద్రం
ఇది శాక ద్వీపాన్ని చుట్టి ఉంది. దధికు ఆవల పుష్కర ద్వీపం

నీరు (మంచినీటి) సముద్రం
ఇది పుష్కర ద్వీపాన్ని చుట్టి ఉంది. ఉదక ఆవల లోకాలోకపర్వతముంది

Images Credit: Freepik