Maha Shivaratri Abhishekam 2024: మార్చి 08 శివరాత్రి లోగా ఇది నేర్చేసుకోండి !
Maha Shivaratri: శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవాలి అనుకుంటున్నారా? భక్తి ఉంది కానీ మంత్రాలు రావు - విధానం తెలియని వారి పరిస్థితేంటి? అలాంటి వారుకూడా అభిషేకం ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి...
How to Perform Shiva Abhishekam at Home: మార్చి 08 శివరాత్రి. అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడికి అభిషేకం చేయాలనే ఆశ ప్రతి భక్తుడిలో ఉంటుంది. అయితే రుద్రం రానివారు, నేర్చుకోలేనివారు అభిషేకం ఎలా చేసుకోవాలా అని ఆలోచిస్తారు..వారికోసమే ఈ విధానం...
అశ్రద్దగా శివలింగంపై కొంచెం నీళ్లు చల్లినా ఎంత మంచి ఫలితమో వివరిస్తూ ఈ శ్లోకం చెబుతారు...
శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి
పత్తిరిసుమంత నెవ్వాడు పారవైచు
కామధేనువతడింట గాడి పసర
మల్ల సురశాఖి వానింట మల్లేచెట్టు
భావము: శివుని శిరస్సుప కాసిన్ని నీళ్ళు చల్లి, కాస్త పత్రిని వేసినంత మాత్రానికే ఆ భక్తుని ఇంట్లో కామధేనువు గాట కట్టిన పశువు అవుతుంది. అలాగే దేవతా వృక్షము అయిన కల్ప తరువు ఆ భక్తుడి ఇంట్లో మల్లె చెట్టుగా మారుతుంది.
అయితే అందరూ వేదమంత్రాలతో పూజలు చేయలేరు. ముఖ్యంగా రుద్రం రాకుండా అభిషేకం చేయలేరు. అలాంటివారికోసమే రుద్రానికి సరిసమానం అయిన ఈ ప్రక్రియ. ఎవ్వరైనా ఫాలో అవొచ్చు, మీకు మీరుగా శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవచ్చు...
Also Read: రెండు దేహాలు ఒక్కటిగా కనిపించడమే అర్థనారీశ్వర తత్వమా?
మొదటి ధ్యాన శ్లోకాన్ని చదివి నమస్కరించాలి...ఆ తర్వాత కింద పేర్కొన్న 15 శ్లోకాలు చదువుతూ అభిషేకం చేయాలి...
ధ్యానం
వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిమ్,
వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్
ఈ 15 శ్లోకాలు చదువుతూ అభిషేకం చేయాలి
నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః
నమస్తే అస్తు ధన్వ నే కరాభ్యాం తే నమో నమః
యా తే రుద్ర శివా తనూః శాన్తా తస్మై నమో నమః
నమో೭స్తు నీల గ్రీవాయ సహ స్రాక్షాయ తే నమః
సహస్రపాణయే తుభ్యం నమో మీఢుష్టమాయ తే
కపర్దినే నమస్తుభ్యం కాలరూపాయ తే నమః
నమస్తే చాత్తశస్త్రాయ నమస్తే శూలపాణయే
హిరణ్యపాణయే తుభ్యం హిరణ్యపతయే నమః
నమస్తే వృక్షరూపాయ హరికేశాయ తే నమః
పశూనాం పతయే తుభ్యం పథీనాం పతయే నమః
పుష్టానాం పతయే తుభ్యం క్షేత్రాణాం పతయే నమః
ఆతతావిస్వరూపాయ వనానాం పతయే నమః
రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమః
నమస్తే మంత్రిణే సాక్షాత్కక్షాణాం పతయే నమః
ఓషధీనాం చ పతయే నమః సాక్షాత్పరాత్మనే
ఉచ్చైర్ఘోషాయ దేవాయ పత్తీనాం పతయే నమః
సత్త్వానాం పతయే తుభ్యం ధనానాం పతయే నమః
సహమానాయ శాన్తాయ శంకరాయ నమో నమః
ఆధీనాం పతయే తుభ్యం వ్యాధీనాం పతయే నమః
కకుభాయ నమస్తుభ్యం నమస్తే೭స్తు నిషంగిణ
స్తేనానాం పతయే తుభ్యం కృత్రిమాయ నమో నమః
తస్కరాణాం నమస్తుభ్యం పతయే పాపహారిణ
వంచతే పరివంచతే స్తాయూనాం పతయే నమః
నమో నిచేరవే తుభ్య మరణ్యపతయే నమః
ఉష్ణీషిణే నమస్తుభ్యం నమస్తే పరమాత్మనే
విస్తృతాయ నమస్తుభ్య మాసీనాయ నమో నమః
శయనాయ నమస్తుభ్యం సుషుప్తాయ నమో నమః
ప్రబుద్ధాయ నమస్తుభ్యం స్థిరాయ పరమాత్మనే
సభారూపాయ తే నిత్యం సభాయాః పతయే నమః
నమ శ్శివాయ సాంబాయ బ్రహ్మణే సర్వసాక్షిణే
Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు
అభిషేకం ఎలా చేయాలి
ఆవుపాలు, పంచామృతాలు, గంగాజలం, భస్మం, బిళ్వదళాలతో అభిషేకం చేయొచ్చు. ఇవేవీ లేకపోతే మంచినీళ్లతో అయినా అభిషేకం చేసుకోవచ్చు. బొటనవేలు పరిమాణం మించుకుండా ఉన్న శివలింగం ఇంట్లో తెచ్చిపెట్టుకుని నిత్యం ఇలా పూజిస్తే మీ ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయి. ముఖ్యంగా శివరాత్రి, కార్తీకమాసంలో నిత్యం ఈ 15 శ్లోకాలు చదువుతూ అభిషేకం చేస్తే భోళాశంకరుడి కరుణ మీపై తప్పక ఉంటుంది.
Also Read: అమ్మవారి వెంటే అయ్యవారు, ఇంత ప్రేమ పొందడం ఎవరికి సాధ్యం!