అన్వేషించండి

Maha Shivaratri 2024: అందుకే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అయ్యారు!

అన్యోన్య దాంపత్యం అంటే తనలో సగం అనుకోవడం మాత్రమే కాదు..భర్త స్వభావాన్ని గమనిస్తూ అక్కడ ఎలా ఉండాలో గ్రహించి తనని తాను మార్చుకోవడం పంచభూత క్షేత్రాల్లో స్వామి-అమ్మవార్లను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది

Maha Shivaratri 2024:  పురుషుడి స్వభావం ఆధారంగా స్త్రీ తన స్వభావాన్ని మార్చుకుంటుంది, మార్చుకోవాలి..అదే అర్థనారీశ్వర తత్వం. అలా ఉండడం వల్లే పార్వతీ పరమేశ్వరులు ఆదిదంపతులు అయ్యారు. పంచభూత క్షేత్రాల్లో అమ్మవారిని గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయా క్షేత్రాల్లో స్వామివారు ఉగ్రరూపంలో ఉంటే అమ్మవారు శాంత స్వరూపిణిగా కొలువై ఉంటారు.. శంకరుడు శాంత రూపంలో ఉంటే పార్వతీ మాత ఉగ్రరూపంలో ఉంటుంది. 

అరుణాచలం - అగ్నిలింగం

ఇక్కడ స్వామివారు ఆగ్రహంతో కనిపిస్తారు.  అందుకే -అందుకే ఇక్కడ అమ్మవారు అత్యంత శాంత స్వరూపంతో ఉంటారు.

Also Read: మార్చి 08 శివరాత్రి లోగా ఇది నేర్చేసుకోండి !

జంబుకేశ్వరం- జలలింగం

జంబుకేశ్వరంలో శివుడు శాంత స్వరూపంతో ఉంటాడు. అందుకే ఇక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరిగా కొలువై ఆగ్రహంగా కనిపిస్తుంది. స్త్రీ ఆగ్రహాన్ని కంట్రోల్ చేసే శక్తి ఏ పురుషుడికి లేదు..అది కేవలం పిల్లల వల్లనే సాధ్యం...అందుకే ఇక్కడ అమ్మవారి విగ్రహానికి ఎదురుగా తనయుడైన వినాయకుడి విగ్రహం ఉంటుంది.

కంచి - పృథ్వి లింగం

కంచిలో సైకత లింగం. ఇసుక లింగం అంటే ఎంత సున్నితంగా ఉంటుందో మీకు తెలిసిన విషయమే కదా. ఇంత సున్నితమైన భర్తని కాపాడుకోవాలంటే భార్య కఠినంగానే ఉండాలి మరి. ఇక్కడ సైకత లింగాన్ని అమ్మవారు ఆలింగనం చేసుకున్నట్టు ఉంటుంది.  శివుడు అభిషేక ప్రియుడు కావడంతో సైకత లింగంపై అభిషేకం చేస్తే కరిగిపోతుందనే ఆలోచనతో..భర్తను రక్షించుకునేందుకు అమ్మవారు జాగ్రత్తగా పొదివి పట్టుకుంటుంది.

Also Read: వయసైపోతున్నా పెళ్లి కాలేదా..అయితే ఈ ఆలయానికి వెళ్లిరండి!

చిదంబరం - ఆకాశలింగం

చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు అని సూచిస్తూ ఆలయంలో మూలవిరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీస్థలం ఉంటుంది.  అందుకే ఇక్కడ అమ్మవారు దృష్టితో నిలబడి ఉంటుంది. అంటే నా భర్త విశ్వమంతా వ్యాపించి ఉన్నారని చెప్పేందుకు సంకేతం ఇది.

శ్రీకాళహస్తి - వాయులింగం 

వాయువు వేగానికి ప్రతీక ఆ వేగాన్ని నియంత్రించడం ఎవరికీ సాధ్యం కాదు..అందుకే ఇక్కడ స్వామివారికి తగ్గట్టుగా అమ్మవారు ప్రశాంతంగా  జ్ఞానప్రసూనాంబగా కొలువై ఉంటుంది. 

Also Read:  చివరకు మిగిలేది బూడిదే - లయకారుడు చెప్పేది ఇదే!
  
స్వామి మనోగతం తెలుసుకుని గౌరిగా మారిన కాళి

గౌరీ దేవిగా కనిపించే అమ్మవారు తెల్లగా కనిపిస్తున్నట్టు చిత్రాలు ఉంటాయి...కాళికా దేవి నల్లగా కనిపిస్తుంది. వేదపరిభాషలో తెలుపు అంటే శాంతం.. నలుపు అంటే కోపం. ఓ సందర్భంలో అమ్మవారి కోపాన్ని గ్రహించిన స్వామివారు....కాళీ అని పిలిచారట. వెంటనే భర్త మనోగతాన్ని తెలుసుకున్న కాళి...తపస్సు చేసి శాంతస్వరూపిణి అయిన గౌరిగా మారిందని చెబుతారు. అంటే స్థిరచిత్వం ఉన్న పురుషుడిని అర్థం చేసుకుంటూ స్త్రీలో మార్పులు ఉండాలన్నదే అర్థనారీశ్వర తత్వం అసలైన అర్థం. అందుకే ధర్మశాస్త్రంలో స్త్రీకి ఉండే నియమాలు పురుషుడికి ఉండవ్.

Also Read: రెండు దేహాలు ఒక్కటిగా కనిపించడమే అర్థనారీశ్వర తత్వమా?

పురుషుడు స్థిరం - స్త్రీ మాయ!

సాధారణంగా ఈశ్వరుడు స్థిరస్వభావం తనలో మార్పులుండవు. అమ్మవారు మాయా స్వరూపం అంటే మారుతూఉంటుంది.  మాయాతత్వం అంటే తప్పుగా అర్థం చేసుకుంటారేమో..  పురుషుడి చతుర్విద ఆశ్రమాల్లో స్త్రీ అనేక పాత్రలు పోషిస్తుందని అర్థం. బ్రహ్మచర్యం స్త్రీ చేయి పట్టుకోవడంతో ముగుస్తుంది. ఆమెను భార్య కింద మార్చుకుని గృహస్థ ఆశ్రమాన్ని పూర్తిచేస్తాడు పురుషుడు. వానప్రస్థంలో అంటే 60 ఏళ్ల వయసులో అదే భార్యను తల్లిగా భావిస్తాడు. తన జీవితానికి పరిపూర్ణనతను కల్పించిన భార్యను సన్యాస ఆశ్రమంలో అమ్మవారిగా భావిస్తాడు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget