చనిపోవడం అంటే ఏంటి - శివుడిచ్చే సందేశం ఏంటి! లయకారకత్వం శివుడి ధర్మం..‘లయం’ అంటే ‘ నాశనం’ అని ఓ తప్పుడు అర్ధాన్ని చెబుతారు కానీ... ‘లయం’ అంటే లీనం చేసుకోవడం, లేదా తనలో కలుపుకోవడం అని అర్థం సృష్టికి, రక్షణకు నాశనం ఉంది కానీ ‘లయం’కు నాశనం లేదు అది శాశ్వతం భౌతికంగా కనిపించేది ప్రతీదీ నాశనం అయ్యేవే. అభౌతికమైనవే శాశ్వతంగా ఉండేవి అభౌతికమైనది ఏదంటే ‘ఆత్మ’ దీనికి చావు పుట్టుకలు ఉండవు ఆత్మ దేహన్ని ధరిస్తే ‘జీవాత్మ’ అవుతుంది. ‘జీవాత్మ’ దేహత్యాగం చేస్తే ‘ఆత్మ’గా మిగిలిపోతుంది. పాంచభౌతికమైన శరీరం పంచభూతాల్లో లయమైపోతుంది. మనిషిని ‘చనిపోయాడు’ అంటాం. ‘చని’ అంటే ‘వెళ్లుట’ అని అర్థం. ఎక్కడకు వెళ్లాడంటే తను వచ్చిన చోటుకే వెళ్లాడు. తిరిగి రావాలంటే.. అక్కడనుంచే రావాలి.. అంటే లయంనుంచే సృష్టి ప్రారంభమవుతుంది. దేహం నుంచి విడివడిన ‘ఆత్మ’ తన ఉత్పత్తిస్ధానమైన శివునిలో లయమైపోతుంది. అందుకే ఆయన లయకారుడు అయ్యాడు.