శివుడిని ఎందుకు పూజించాలో తెలుసా అసలు! మార్చి 8 శుక్రవారం రాత్రి 8.13 వరకూ త్రయోదశి ఉంది... ఆ తర్వాత చతుర్థశి ప్రారంభమైంది లింగోద్భవ సమయానికి చతుర్ధశి ఉండడం ప్రధానం..అందుకే మహాశివరాత్రి మార్చి 8న జరుపుకోవాలి సాధారణంగా పండుగలన్నీ పగటిపూట జరుగుతాయి పూజలు, పసందైన పిండివంటలు , కొత్త బట్టలతో రోజంతా సందడే సందడి కానీ శివరాత్రి ఇందుకు భిన్నంగా ఉపవాసం, జాగరణతో, అర్థరాత్రి పూజలతో గడుస్తుంది ఐశ్వర్యం, ఆనందం ప్రసాదించాలని దేవుడిని పూజిస్తారు.. కానీ... సంసార బంధాల నుంచి విముక్తి కల్పించమని, మోక్షాన్ని ప్రసాదించమని శివయ్యను ఆరాధిస్తారు సృష్టి తత్వాన్ని బోధించవయ్యా పరమేశ్వరా అని పంచాక్షరి జపం చేస్తారు శివుడిలో ఐక్యం అయ్యేందుకు శివరాత్రి పర్వదినం అత్యంత పుణ్యదినంగా భావిస్తారు ఓం నమః శివాయ