శవం తల దగ్గర దీపం ఎందుకు?

ఏ శుభకార్యం తలపెట్టినా జ్యోతి ప్రజ్వలన చేస్తారు

మరి శవం తల దగ్గరే దీపం ఎందుకు వెలిగిస్తారు?

అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేందుకే జ్ఞానం అనే దీపం అని చెప్పినట్టే...

చనిపోయిన వ్యక్తిని మోక్షం వైపు నడిపించేందుకే శవం దగ్గర దీపం అని చెబుతారు

మరణానంతరం శరీరం నుంచి బయటికొచ్చే ఆత్మ బ్రహ్మ కపాలం(తలలో పైభాగం) గుండా వెళుతుంది

ఆత్మ వెళ్లేందుకు ఉత్తర, దక్షిణ మార్గాలుంటాయి

ఉత్తర మార్గంలో వెలుగు, దక్షిణ మార్గంలో (యముడు ఉండే స్థానం) చీకటి ఉంటుంది...

చీకటి మార్గానికి తలదగ్గర దీపం వెలుగు చూపుతుందంటారు

Image Credit: Pixabay