మహా శివరాత్రి జాగరణ-ఉపవాసం నియమాలివే!

2024 మార్చి 08 మహా శివరాత్రి... ఈరోజు ఉపవాసం, జాగరణ చేసేవారు కొన్ని నియమాలు పాటించాలి

సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. సూర్యోదయం తర్వాత నిద్రలేచిన వారు చేసే జాగరణ ఫలితాన్నివ్వదు

వేకువజామునే భక్తిశ్రద్ధలతో భోళాశంకరుడిని పూజించాలి , అభిషేకం చేయాలి.

జాగరణ అంటే భౌతికంగా మేల్కొని ఉండాలన్న ఆలోచనతో ఏదో టైమ్ పాస్ చేయడం కాదు...

రోజంతా పంచాక్షరి నామస్మరణలో, శివయ్య నామస్మరణలో గడపాలి

శివరాత్రి రోజున శివ లింగం దగ్గర నేతి దీపం వెలిగించడం శుభప్రదం

శివరాత్రి ఉపవాసం ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే మర్నాడు చతుర్థశి తిథి ముగిసేలోగా ఉపవాసం విరమించాలి

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఒక్కపూట భోజనం చేసి శివనామస్మరణలో గడిపినా మంచిదే

శివరాత్రి ఉపవాసం ఉండేవారు పాలు, పండ్లు లాంటి సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి

Images Credit: Pinterest