శివుడికి అభిషేకం ఇలా ఈజీగా చేసేసుకోండి!

అభిషేక ప్రియుడైన శివుడి కోసం భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు

ఆవుపాలను శివలింగంపై పోస్తూ అభిషేకం చేయొచ్చు

పంచామృతాలు (పాలు,పెరుగు,నెయ్యి,నీరు,తేనె ) తో అభిషేకం

గంగాజలం కానీ ఏవైనా నదుల నీరు కానీ ఇంట్లో ఉంటే ఆ నీటితో అభిషేకం చేయొచ్చు

భస్మంతో అభిషేకం చేయాలి అనుకుంటే ఓ వస్త్రంతో చుట్టి శివలింగంపై అద్దుతూ రుద్రం చదువుకోవచ్చు

బిళ్వదళాలు ఉంటే ఒక్కో మంత్రం చదువుతూ దళాలు పెడితే చాలు

ఈవేమీ లేకపోతే మంచినీళ్లు చాలు.. కాసిని నీళ్లు చల్లితే కరిగిపోతాడు భోళాశంకరుడు

అన్నిటినీ మించి భక్తి ముఖ్యం...

బొటనవేలు పరిమాణం మించకుండా ఉన్న శివలింగం ఇంట్లో పెట్టుకుని నిత్యం అభిషేకం చేయొచ్చు

ముఖ్యంగా శివరాత్రి, కార్తీకమాసం లో మంచి ఫలితాలు పొందుతారు
Images Credit: Pinterest