ఫిబ్రవరి 24 మాఘపూర్ణిమ : మహామాఘీ విశిష్టత

సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే, మాఘమాసం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది.

సముద్రం, నదుల్లో స్నానమాచరించలేనివారు బావుల దగ్గరగానీ, చెరువుల వద్దగానీ నదుల పేర్లు స్మరిస్తూ స్నానమాచరించాలి

మాఘమాసం చివరి మూడురోజులైనా పవిత్రస్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందుతారు.

మాఘమాసం చివర మూడుస్నానాలనూ అంత్యపుష్కరిణీ స్నానాలు'' అంటారు.

స్నానం చేసేటప్పుడు పఠించాల్సిన శ్లోకం ఇది

దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం

మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ

దుఃఖం, దారిద్ర్యం, పాపం నశించడానికి ఈ పవిత్ర మాఘ స్నానం చేస్తున్నానని ఈ శ్లోకం అర్థం.

స్నానానంతరం పఠించాల్సిన శ్లోకం

సవిత్రే ప్రసవితే చ పరంథామ జలేమమ
త్వత్తేజసా పరిభష్టం పాపం యాటు సహస్రథా''