చాణక్య నీతి: ఈ 3 విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు!

ఓ వ్యక్తికి ఎప్పుడూ విజయం అందాలంటే కొన్నింటిని ఫాలో అవ్వాలి

ఇలాంటి వ్యక్తుల దగ్గర లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నది చాణక్యుడి అభిప్రాయం

ప్రతి వ్యక్తి ఫాలో కావాల్సిన 3 విషయాలు ఏంటంటే

ఆహారాన్ని గౌరవించే ఇంట్లో ఎప్పుడూ దేనికీ లోటు ఉండదు.

ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా ఉండేవారింట్లో, వృధా చేసే వారింట లక్ష్మీదేవి ఉండదు

జ్ఞానులను గౌరవించాలి వారితో సాంగత్యం కలిగి ఉండాలి

తెలివైన వ్యక్తులు సరైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తారు..మూర్ఖులు మీ చుట్టూ సమస్యలు సృష్టిస్తారు

భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి - ఇద్దరూ ప్రేమగా ఉండే ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది

నిత్యం వాదనలు, గొడవలు ఉండే ఇంట్లో పేదరికం తిష్టవేసుకుని కూర్చుంటుంది సంపద నిలవదు