మహాశివరాత్రి 2024: మహాశివరాత్రికి సందర్శించాల్సిన ప్రముఖ శైవ క్షేత్రాలివే!

సోమ‌నాథ్ -గుజ‌రాత్
ఇక్కడ శ్రీకృష్ణుడు తన లీలతో వెలిగించిన దీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉండటం ఇక్కడి ప్రత్యేకత

మ‌ల్లికార్జున స్వామి- శ్రీశైలం (ఆంధ్రప్రదేశ్)
గౌరీదేవితో కలిసి శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడుగా వెలిసిన క్షేత్రం

మ‌హాకాళేశ్వ‌ర్- ఉజ్జయినీ (మధ్యప్రదేశ్)
ముఖద్వారం దక్షిణాభిముఖంగా, గర్భగుడిలో శ్రీచక్రయంత్రం తిరగేసి ఉంటుంది

ఓంకారేశ్వర్ -మధ్యప్రదేశ్
న‌ర్మ‌దా న‌ది తీరంలో ఉండే ఈ క్షేత్రంలో ఓంకారేశ్వర , అమలేశ్వర లింగాలు పక్కపక్కనే ఉంటాయి

వైద్యనాథ్- మహరాష్ట్ర
పాట్నాకు 220 కి.మీ దూరంలో ఉంది. ఈ స్వామిని దర్శించుకుంటే వ్యాధులు నయం అవుతాయని నమ్మకం

శ్రీనాగనాథేశ్వర-మహారాష్ట్ర
ఇది భూమిపై మొదటి జ్యోతిర్లింగంగా చెబుతారు. పాండవులే స్వయంగా ఆలయం నిర్మించారని చెబుతారు

రామేశ్వరం- తమిళనాడు
బ్రహ్మ హత్యాపాతకాన్ని తొలగించుకునేందుకు శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం ఇది..

కేదార్నాథ్ జోతిర్లింగం- ఉత్త‌రాంచల్
ఎద్దుమూపుర ఆకారంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. ఈ ఆలయాన్ని ఏడాదికి 6నెలలు మాత్రమే తెరుస్తారు.

త్రయంబ‌కేశ్వర్- మ‌హారాష్ట్ర నాసిక్
శివలింగము చిన్న గుంటవలె కనిపిస్తూ అందులో త్రిమూర్తులకు ప్రతీకగా 3 చిన్న లింగాలు కనిపిస్తాయి

భీమశంకరం- మహారాష్ట్ర
త్రిపురాసుర సంహారం తర్వాత శివుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశం . శివలింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తుంటుంది

విశ్వేశర జోతిర్లింగం-వారణాసి
దేవతలు నివసించే పుణ్యక్షేత్రం అని చెప్పే కాశీలో కొలువైంది విశ్వేశ్వర జ్యోతిర్లింగం.

ఘృష్ణేశ్వరం- మహారాష్ట్ర
మ‌హారాష్ట్ర ఔరంగ‌బాద్ అజంతా ఎల్లోరా గ్రామంలో ఘృష్ణేశ్వర ఆలయం ఉంది.