2024 లో పెళ్లి ముహూర్తాలు ఎప్పటివరకూ - మూఢం ఎన్నాళ్లు! 2024 లో పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ 26 వరకు ఉన్నాయి. ఆగష్టు 8 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఉన్నాయి ఈ మధ్యలో అంటే ఏప్రిల్ 27 నుంచి ఆగష్టు 8 వరకూ దాదాపు మూడునెలలు మూఢం. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమ్మీద ఉన్నవారికి కనపడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అంటారు. గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం, శుక్రడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యం సూర్యునికి దగ్గరగా గురు , శుక్రులు వచ్చి నప్పుడు , గురు శుక్రుల శక్తులు తగ్గి బలహీనమైపోతాయి శుభగ్రహాలైన గురు, శుక్రులు సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో శుభకార్యాలు నిర్వహించర. ఏ శుభకార్యానికి అయినా గురు, శుక్ర గ్రహాల బలమే ప్రధానం. ఇవి బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలసిరాదన్నది పండితుల మాట. all Images Credit: Pinterest