ఇల్లు మారాలి అనుకుంటున్నారా? అయితే, మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి. చాలామందికి ఏ రోజు ఇల్లు మారాలనేది తెలీదు. బుధ, గురు, శుక్ర వారాల్లో ఇల్లు మారితే అదృష్టం కలిసి వస్తుంది. అత్యవసరం అనుకుంటే శని, ఆది వారాలు కూడా పర్వాలేదు. కానీ సోమ, మంగళ వారాల్లో ఇల్లు మారకూడదు. వారం ఒక్కటే కాదు.. తిథి కూడా చూసుకుని ఇల్లు మారడం మంచిది. తదియ, పంచమి, సప్తమి, ఏకాదశి తిథుల్లో ఇల్లు మారవచ్చు. గృహ ప్రవేశ సమయంలో లక్ష్మీ, గణపతి, సరస్వతి శివపరివారం, శ్రీదేవీ భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి చిత్రపటాలు తీసుకెళ్లాలి. కొత్త గిన్నెలోనే పాలు పొంగించాలి.