Ramayana: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నల దర్శనం కోసమే నాలాంబళం యాత్ర!
Ramayana: ఏ రామాలయంలో చూసినా రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, ఆంజనేయుడు కనిపిస్తారు..ఎక్కడా భరత, శత్రుఘ్నులు కనిపించరు.. మరి నలుగురు అన్నదమ్ముల దర్శనం కావాలంటే...
![Ramayana: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నల దర్శనం కోసమే నాలాంబళం యాత్ర! Ayodhya Rama and his Brothers Nalambalam Yatra visit nalambalam in thrissur and ernakulam in Kerala Ramayana: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నల దర్శనం కోసమే నాలాంబళం యాత్ర!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/8f8def6a0ee07bb9298d7c3f92d014d31705819001498217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nalambalam Temples In Kerala: దశరథుడికి ముగ్గురు భార్యలు కౌశల్య,సుమిత్ర, కైకేయి..వాళ్లకి నలుగురు సంతానం రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అయితే ఏ ఆలయంలోనూ రాముడితో పాటూ లక్ష్మణుడు కనిపిస్తాడు కానీ మిగిలిన ఇద్దరి దర్శనం ఉండదు. మరి వాళ్లిద్దరి ఆలయాలు లేవా అంటే..ఉన్నాయి. నలుగురి సోదరులకి విడివిడిగా ఆలయాలున్నాయి. ఈ నాలుగు ఆలయాల దర్శనాన్నే నాలాంబళం యాత్ర అంటారు.
Also Read: అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట సమయంలో శ్రీరామ భక్తులు ఈ శ్లోకాలను మననం చేసుకోండి!
నలుగురి సోదరుల దర్శనం నాలాంబళం యాత్ర
పితృవాక్య పరిపాలకుడిగా రాజ్యాన్ని వదిలి అరణ్యవాసానికి వెళ్లిన రాముడిని.. సీతాదేవి, లక్ష్మణుడు అనుసరించారు. అన్నయ్య అడవులకు వెళ్లిన సంగతి తెలుసుకున్న భరతుడు స్వయంగా వెళ్లి రాజ్యానికి తిరిగి రమ్మని ప్రార్థించినా తండ్రి మాట జవదాటనని చెప్పాడు రాముడు. అందుకు ప్రతిగా ఆ సింహాసనంపై శ్రీరాముడి పాదుకలను ఉంచి మరో సోదరుడు శత్రుఘ్నుడి సహాయంతో పరిపాలించాడు కానీ తాను మహారాజుగా సింహాసనం అధిష్టించలేదు భరతుడు. అయితే ఏ రామాలయంలోనూ భరతుడి, శత్రుఘ్నుడి విగ్రహాలు పెద్దగా కనిపించవు. కానీ కేరళ వెళితే నలుగురి సోదరులను తనివితీరా దర్శించుకోవచ్చు. ఎర్నాకుళం జిల్లాలో ఉన్న ఈ ప్రదేశాలనే నాలాంబళం యాత్రగా పేర్కొంటారు.
Also Read: ఆదర్శపురుషుడు అంటే ఎవరు - ఈ సుగుణాలుంటే మీరూ రాముడే!
సముద్రంలో కొట్టుకొచ్చిన విగ్రహాలు
మళయాళంలో అంబళం అంటే దేవాలయం. నాల్ అంటే నాలుగు. శ్రీరామునితో పాటు లక్ష్మణ,భరత, శత్రఘ్నుడు కొలువైన ఆలయాలను ఒకే రోజులో దర్శించుకోవడాన్ని నాలాంబళ యాత్ర అని అంటారు. మళయాళ క్యాలండర్ ప్రకారం కర్కాటకం నెలలో అంటే జూలై - ఆగష్టులో ఈ యాత్ర ఉంటుంది. ఒకే రోజులో యాత్రను పూర్తిచేస్తే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణభగవానుడు ఈ నాలుగు విగ్రహాలను పూజించాడని స్థలపురాణం. ద్వాపరయుగం చివర్లో ప్రళయం వచ్చి ద్వారక నీట మునిగి తర్వాత ఈ విగ్రహాలు సముద్రంలో కొట్టుకొచ్చి కేరళ తీరంలోని చీటువ ప్రాంతంలో తేలాయని చెబుతారు. వక్కయిల్ కైమల్ అనే స్థానికమంత్రి కలలో స్వామివారు కనిపించి విగ్రహాలు గురించి చెప్పడంతో ఆ మర్నాడు వాటిని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించారని స్థలపురాణం.
Also Read: రామాయణం గురించి మీకు ఎన్ని విషయాలు తెలుసు - వీటికి సమాధానం చెప్పగలరా!
నాలాంబలం చరిత్ర
పురాణాల ప్రకారం, రాముడు లంకకు వెళ్లే మార్గంలో ఎర్నాకులం జిల్లాలో ఉన్న రామపురం సమీపంలో విశ్రాంతి తీసుకున్నాడు. అందమైన పర్వతాలు, అడవులు, పచ్చదనంతో కూడిన ఈ ప్రదేశానికి రాముడు చేరుకున్నప్పుడు, అది తన ధ్యానానికి అనువైన ప్రదేశంగా భావించాడు. అన్నను వెతుక్కుంటూ అదే మార్గంలో నడిచి వెళ్లారు భరతుడు, శత్రుఘ్నుడు. రాముడిని భరతుడు కలసిన ప్రదేశం కూడా ఇదే అని అందుకే రామాపురం సమీపంలోనే నలుగురి సోదరలకు ఆలయాలు నిర్మించారని కథనం.
Also Read: కామాతురాణాం నభయం నలజ్జ - ఫలితమే రాముడి చేతిలో రావణ సంహారం!
ఒకే రోజు నాలుగు ఆలయాల సందర్శనం
ఈ యాత్ర మొదటగా త్రిస్సూర్ జిల్లాలోని త్రిప్రయార్ ఆలయంలో శ్రీరాముని దర్శనంతో ప్రారంభమవుతుంది. తిరుఓనం రోజు ఆలయంలో సేతుబంధన మహోత్సవం నిర్వహిస్తారు. రాముడిని దర్శించుకున్న అనంతరం ఇరింజల్‌కుడలోని కూడల్‌మాణిక్యం ఆలయానికి చేరుకోవాలి. ఇక్కడే భరతుని ఆలయం ఉంది. ఎర్నాకుళం జిల్లాలోని అంగమాలి ప్రాంతంలోని మూళికులంలో లక్ష్మణుడి ఆలయం, ఆ తర్వాత శత్రఘ్నుడి ఆలయం సందర్శనంతో నాలాంబళ యాత్ర ముగుస్తుంది. ఈ నాలుగు ఆలయాలకు సమీపంలోనే హనుమంతుడి ఆలయం ఉంటుంది. చివరిగా హనుమంతుడిని దర్శించుకున్నాడ యాత్ర సంపూర్ణం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)